Marakatha Sri Laxmi Ganapathi Devastanam

మరకత శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానము

ఓం మరకత శ్రీలక్ష్మీగణాధిపతయే నమః మరకత శ్రీలక్ష్మీ గణపతి దేవస్థానము భూదాన మహాయజ్ఞం

MSLG Seva Services

Online Services

Social Activities

Call us 9949060885

Voluntary Services

Dress Code

Educational Activities

Sevas

Brahmotsavam

MSLG Trust

MSLG Navaratrulu

Previous slide
Next slide

Today Updates

 

సర్వసస్మాలయే సర్వసస్మాకే సర్వససంటి | సర్వసస్య హరే కార్తీ సర్వసస్యాత్మిక భవే।
భూమి భూమిుపస ర్వన్నీ భూమిపాలఏరాయతే| భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూబుదే

శ్లో॥ శ్రీ మన్మరకతం లక్ష్మీ గణేశం సత్యపూజితమ్| కానాజీగూడ నిలయం వందే సంకష్టహారకమ్॥

మీ రాక మా కోరిక! మీరు కల్పించుకోవాలి తీరిక !!

దూరభారంబనక ధైర్యంబు మది చెడక.
దైవ కార్యమనుచు తరలిరండు!!

శ్రీ విద్యా ఉపాసకులు, లలాట రేఖా శాస్త్ర నిపుణులు,
వాస్తు, జ్యోతిష్య ఆగమ శాస్త్ర పండితులు
వాచస్వతి, ధార్మిక సాఠభౌమ, సేవారత్న
శ్రీ డా|| మోత్కూరు సత్యనారాయణ
(ఆలయ వ్యవస్థాపకులు, కార్యనిర్వాహకులు)

కలౌచండీ వినాయక కలియుగంలో పూజించినంతనే అనుగ్రహించే దేవతలు చండీ మరియు వినాయకులని శాస్త్రవచనం.

అది వరబ్రహ్మ పురుషరూపమే గణవతిగా, మూల ప్రకృతి శక్తియే శ్రీమహాలక్ష్మీగా, విశ్వమంతా వ్యాపించి విఘ్న వినాశకత్వాన్ని కలిగి, సిద్ధి, బుద్ధి శక్తులన్నింటిని ఇచ్చే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడే మరకత శ్రీలక్ష్మీ గణపతి.

ఐలం, జ్ఞానం, విశ్వర్యం, ఆనందాన్నిచ్చే విఘ్నేశ్వరున్ని అద్వితీయమైన, అప్రమేయమైన విశిష్ఠమైన బుధగ్రహరత్నమైన మరకత శిల (పచ్చ-ఎంరాల్డ్) తో మలచిన మరకత శ్రీలక్ష్మీ గణపతి స్వామివారు శ్రేయ, యశోకారకుడై, కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి, ఆరోగ్య, మానసిక స్థైర్యాన్ని ఇస్తాడు.

మానవుని ప్రగతికి, పరమార్థానికి అవరోధాలైన అజ్ఞానం, దారిద్ర్య దుఃఖాలనే అడ్డంకులను అధిగమింపజేసి, నాయకత్వ లక్షణాలను, జీవితంపై సానుకూల దృక్పథాన్ని కల్పించి, మానవ జన్మను చరితార్థం చేసుకునే విధంగా నడిపించి. మూలాధార చక్రాన్ని ఉత్తేజితం చేసి మోక్షసాధనకు మార్గదర్శనం చేసి ఏకత్వం, అతీతత్వం అని గ్రహించే ఆధ్యాత్మిక సాధనయే మరకత శ్రీలక్ష్మీ గణపతి ఆరాధనలోని పరమార్థం.

ప్రపంచంలోనే అరుదైన, మహిమాన్వితమైన మరకత శ్రీలక్ష్మీగణపతి దేవాలయాన్ని భక్తుల సౌకర్యార్థం విశాలంగా చేయాలనే నేపథ్యంలో స్థలసేకరణ జరిపి, స్వామివారికి దీపాలంకరణసేవ, సహస్రకలశాభిషేకం, మొ|| నిత్యసేవలు, స్వామివారి నిత్యకళ్యాణమంటపం, అన్నప్రసాదవితరణ భవనము, వసతిగృహముల యొక్క నిర్మాణాలను మరకత శ్రీలక్ష్మీగణపతి దేవాలయ ట్రస్టు వారు భారీ వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినది.

భూదానం విశిష్టత

మమ మానవ జన్మ సాఫల్యత
సిద్ధ్యర్థం భూదానం అహం కరిష్యే!

త్రేతాయుగం, ద్వాపర యుగాలలో యజ్ఞయాగాదులు, తపస్సు ద్వారా మానవులు మోక్షాన్ని పొందారు. కలియుగంలో దానధర్మాలు, దైవారాధన, నామపారాయణ, నామస్మరణల ద్వారానే మోక్ష మార్గాన్ని దైవం ప్రసాదించాడు.

దానాలన్నింటిలో భూదానం, అన్నదానం, గోదానం ఎంతో విశిష్టమైనవి, రత్నగర్భ అయిన భూమిని దానం చేయడమనేది మహోత్కృష్టమైన దానం. సువర్ణ, జల, నవరత్న ఖచిత మణిమాణిక్యాలన్ని భూమిలోనే ఉన్నాయి. అట్టి భూమిని దానం చేయడం వల్ల పైవన్నీ దానంచేసిన ఫలితాన్ని పొందుతాము. నిస్వార్ధంతో చేసే దానాన్ని గ్రహించడానికి స్వయంగా భగవంతుడే యాచకుడై వచ్చి కర్ణుడు, బలిచక్రవర్తికి మోక్షాన్ని ఇచ్చినట్లు పురాణేతిహాసాలు చెబుతున్నాయి.

* భూదానం ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి వంశం పుణ్యప్రదమవుతుంది, పితృదోషాలు నశిస్తాయి.

* భూదానం చేసే దాతలకు వస్త్ర, ధన, దాన్యాదులు, అధికారం, లక్ష్మీ కటాక్షం, సత్సంతానం ప్రాప్తిస్తాయి.

* భూమి రత్నగర్భ కనుక భూదానం చేయడం వల్ల భూసంపద, ఆయుర్వృద్ధిని పొందుతాము.

* భూదానం చేయడం వల్ల భూమాత సంతసించి ఆరోగ్యాన్ని స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

* పుణ్యక్షేత్రానికి భూదానం చేయడం వల్ల సమస్త కోరికలు నెరవేరి, సకల పాపాల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు.

ఇట్టి బృహత్తర కార్యక్రమములో అందరూ భాగస్వాములై యధాశక్తి గజం భూమి లేదా అంతకంటే ఎక్కువ భూమిని భూదానంగా సమర్పించు భక్తులచే స్వయంగా 3 రోజులు హోమాలు, భూదాన యజ్ఞ మహాసంకల్పం చెప్పి మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి భూదానం చేయించబడును. చ|| అడుగు (Sq. Feet) భూమి లేదా కుటుంబ సభ్యులలో ఒక్కొక్కరి పేరున రూ॥ 111/- చొప్పున విరాళములు అందించి భూదాన ప్రక్రియలో పాలు పంచుకోవాలని భక్తులందరిని ఆహ్వానిస్తున్నాము.

భూదానం స్వీకరించిన మరకత శ్రీలక్ష్మీగణపతిస్వామివారు తన కృపాకటాక్షములను ప్రతీ భక్తునిపై ప్రసరింపజేసి ఆయురారోగ్యవిశ్వర్యాలు, యశస్సుతో జన్మను చరితార్థం చేసుకునే భాగ్యాన్ని ప్రసాందించాలని కాంక్షిస్తున్నాము.

సర్వేజనా సుఖినోభవంతు యశోధర్మస్తతోజయః

గమనిక: విరాళాలు అందించిన భక్తులు 806 సౌకర్యాన్ని వినయోగించుకోగలరు.

గమనిక: పై కార్యక్రమాలలో పాల్గొనుటకు మరియు గురువు గారిచే Forehead Reading ద్వారా జాతకము చూపించుకొనుటకు

మరకత శ్రీలక్ష్మీ గణపతి స్వామి వారి దర్శనం సకల పాప వినాశనం, మహామంగళ ప్రదం

11 గజాలు మరియు అంతకంటే ఎక్కువ భూదానం చేయ దలచిన వారు ట్రస్ట్ వారిని సంప్రదించగలరు

CONTACT INFO

Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015 

SOCIAL MEDIA