Marakatha Sri Laxmi Ganapathi Devastanam

మరకత శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానము

సకల వేదాలకు మంత్రాలకు ఆదిలో వెలువడే ప్రణవ స్వరూపుడే గజాననుడు , విశ్వంలోని విఘ్నాలన్నింటిని అణిచి వెయ్యడానికి విఘ్నరాజై, నాయకుడికి కావాల్సిన నేర్పు , విక్రమ్, విద్యా , విజ్ఞానం , విజ్ఞత, వివేకం , విచక్షణ వంటి ఉజ్జ్వల విశిష్ట నాయకత్వ లక్షణాలు కల దైవమె వినాయకుడు.

భక్తుల సర్వకార్య, సర్వాభీష్టాలను నెరవేర్చుతూ భక్తుల కొంగుమంగారమై , మహిమాన్పిత మూర్తిగా శోభిల్లుతూ , తెలంగాణ రాష్ట్రంలోని సింకింద్రాబాదు, కానాజిగూడలో ప్రపంచంలో అరుదయిన అత్యంత విశిష్టమైన మరకటము (పచ్చ- ఎమరాల్డ్) తో మలచిన మరకత శ్రీ లక్ష్మి గణపతి స్వామి దర్శనం సకల పాప వినాశనం -మహామంగళ ప్రదం.

మానవ జీవితంపై నవగ్రహాలు, దశ , అంతర్దశస్థితులు ఆధారంగా చూపే దుష్ప్రభావాలను దూరం చేసుకోవడానికి సవరణ, సాపత్నీ , సవాహనపూర్వక నవగ్రహాల ఆరాధన ఎంతో శ్రీయోదాయకము. ఇంతటి శ్రేష్టమైన , అపురూపమైన నవగ్రహాల మంటపము మనకు మరకత శ్రీ లక్ష్మి గణపతి దేవాలయములో దర్శనమిస్తాయి.

సూరుయుడు-ఎరుపు , చంద్రుడు-తెలుపు, కుజుడు- ఎరుపు , బుధుడు- ఆకుపచ్చ , గురువు-పసుపుపచ్చ,  శుక్రుడు-తెలుపు, శని – నీలం/నలుపు, రాహు, కేతువులు – ధూమ్రవర్ణములో కల శిలలతో , సాపత్నీ సవాహన  పూర్వకముగా ఉన్న నవగ్రహములు భక్తులు అభిషేక, జప, ధ్యానాదులు, ప్రదక్షిణల వలన గ్రహానుకూలతను పొంది పరిపూర్ణ ప్రయోజనాలను సిద్దింప చేసుకొని విజయాలను పొందడంలో సఫలీకరతులవుతున్నారు.

 

                                                                                                                స్థల చరిత్ర

వేధవాస్తు జ్యోతిష ఆగమశాస్త్ర పండితులు, శ్రీ విద్యాఉపాసకులు , లలాటరేఖా సస్త్ర నిపుణులు , వేయిద్యావేత్త సంఘసేవకులు, ఆధ్యాత్మిక ప్రచారకులు వాచస్పతి బిరుదాంకితులు అయినా బ్ర|| శ్రీ || డా. మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి  “కాయాక సేవయే కాటయ్యాయని సేవ” యని నమ్మి ప్రతివ్యక్తిలో తానూ ఉపాసించే పరమాత్మ స్వరూపాన్ని దర్శిస్తూ “మానవసేవయే మాధవ సేవ ” యని ఎన్నో సేవాకార్యక్రమములు , జీర్ణదేవాలయముల పునరుద్ధరణ నిర్వహిస్తున్నారు.

పరబ్రహ్మస్వరూపిణి , భగవతి, శ్రీ లలితాదేవి స్వప్న సాక్షాత్కార దర్శన ఆదేశానుసారం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రపంచంలో అరుదైన దేవాలములలో ఒకటిగా అత్యంత విశిష్టమైన మరకటము (పచ్చ-ఏంరాల్డ్) తో మలచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి మరియు సవరణ, సపత్నీనవాహన పూర్వక నవగ్రహములను శ్రీ దూర్మిఖీ నామ సం|| చైత్ర బ|| పంచమి , బుధవారము అనగా 27 -4 -2016 న పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ అభివఉద్దండ విద్యాశంకరా భారతీ స్వామి, హిందూదేవాలయ ప్రతిష్టాపన పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కమలానోదభావతీ స్వామి బ్ర || శ్రీ || డా. దేవిశ్రీ గురూజీ  కారకమలములచే మరకత శ్రీ లక్ష్మీ  గణపతి స్వామి , విగ్రహ ప్రతిష్టా , నవగ్రహ ప్రతిష్టా, శిఖర , కుంభాషేకములు వేదపండితులు , ఋత్వికులు  వేదపారాయణతో విద్యాదాహతాగ్ని ఆచార్యచూడామణి మాడుగుల మాణిక్య సోమయాజులు గారి వైదిక నిర్వహణలో అంగరంగవైభవంగా , నేత్రపర్వముగా నిర్వహించారు

మారక శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి  5కి. మీ  దూరంలో చక్కని బస్సు సౌకర్యములు కల మిలటరీ డైరీ ఫామ్ రోడ్ లో కానాజీగూడ నందు నిర్మించబడినది.

ఆలయ ముఖద్వారం అయినా గాలిగోపురం నుండి 37 మెట్లు ఎక్కి పైకి రాగానే దేవాలయానికి హృదయం లాంటి ధ్వజస్తంభం 50 అడుగులు ఎత్తులో రాగి తాపడంలి సుందరమైన చెక్కాణంతో దేదీప్యమైన శోభతో కనబడుతుంది. ఉత్సవాలకు తోరణమై అంతరిక్షంలోని దైవశక్తిని దేవాయంలోనికి ఆహ్వానిస్తుంది. ధ్వజస్తంభం నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాల వలన పాజిటివ్ వైబ్రేషన్స్ ఉత్పన్నమయ్యి మనలోని చెడుభావాలను ఒత్తిళ్లను దూరం చేసి మనకు కావాల్సిన శక్తిని ఇస్తుంది.

గర్భాలయములో మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు దసహస్తములతో ఖడ్గం , చక్రం, అంకుశం, పాశం , గదా, జామపండు, పద్మం , ఔషదీపాత్ర , చేసురుకుగడ కలిగి దంతపుకొమ్ము కలిగిన వరాహస్తాన్ని చూపిస్తూ, కుడివైపు తిరిగిన తొండములోరత్నకలశాన్ని కలిగి వామాంకముపై కలువపూవు ధరించిన లక్ష్మీదేవిని కుర్చూన్ద బెట్టుకుని , మహాశక్తులన్నింటిని తనలో ఇముడ్చుకుని అంతటావ్యాపించే నైజం క విష్ణుతత్వం కల మహా విరాట్ స్వరూపాన్ని కలిగియున్న మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దర్శన భాగ్యతో మన జన్మధన్యమైందనే అనుభూతిని పొందుతాము.

బాల, తరుణ, భక్తి, వీర, శక్తి, దివిజ, సిద్ధి, ఉత్తిష్ఠ , విష్ణు, ఖ్సిప్రా , హేరంబ , విజయ, నృత్య, ఊర్ధ్వ, విజయ లక్ష్మీ, మహాగణపతుల మూర్తి స్వరూపములు మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి గర్భాలయము మరియు ద్వారములపై కొలువుదీరి స్వామి వారి వైశిష్ట్వాన్ని వివరిస్తూంటాయి. స్వామివారిని దార్చించిన భక్తులకు స్వామి వారి ఎదురు ఉన్న మూషికము తమ కోరికలను , కష్టాలని నాకు చెబితే చాలు స్వామి వారికి విన్నవిస్తానని చెవులు రికకఱంచి సదాస్వామి వారి సేవలో ఉంటానని చెబుతున్నట్లు కనిపించే మరకమని శిలతో ఉన్న మూషికరాజాన్ని దర్చించి తమ వెన్నంపల్లి నినదించి , మారక శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి దృఢ సంకల్పంతో ప్రదక్షిణాలు చేయవలిసి ఉంటుంది.

కాజీగూడలో కొలువైయున్న మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఎన్నో లీలలు చమత్కారాలు చేస్తూ భక్తుల పాలిట కొంగుబంగారమై తానూ ఇక్కడ వెలసియున్నానని మనకు ఎన్నో నిదర్శనాలు చూపిస్తున్నారు.

కామారెడ్డిలో సంస్కృత కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులై ఆయాచితం నటేశ్వర శర్మ గారికి ఒక రాత్రి స్వామి వారు కలలో కనబడి వారిచే సుప్రభాత, స్తోత్ర, ప్రపత్తి, మంగళాశాసనం వ్రాయించుకున్నారు.

ముంబై లో ఒక ఫ్యాక్టరీ మూయబడి ఎన్నో కష్టాలలో ఉన్నా హిందూ దేవతలా మీద నమ్మకంలేని ఒక ముస్లిం వ్యక్తి కలలో కనబడి అడ్రస్ చెప్పి తన వద్దకు రప్పించుకొని ౨౧ అభిషీకాలు చేయించుకున్నారు.

ఆలయ ప్రత్యేకత ఏమిటంటే , ధృడ సంకల్ప, విశ్వాసం, భక్తితో స్వామి వారికి 11  ప్రదక్షిణలు చేస్తే నాకోరిక తప్పక నెరువేరుతుంది. అప్పుడు బకెట్లు వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి స్వామి వారికి మ్రొక్కులు తీర్చుకుంటారు. నిరుద్యోగులైన తండ్రీకొడుకులకు ఉద్యోయోగాలు రాగానే మ్రొక్కు తీర్చుకోవడానికి ఆలయానికి రాగ వారికి అక్కడి పూజారి చాణుక్య రూపంలో మూసివున్న గర్భాలయ ద్వారము గుండా లోపలికి పూతున్నట్లు స్వామి దర్శనమిచ్చాడు.

శారీరక , మానసిక రుగ్మతల , జీర్ణ, వరాల, చక్ర సంబంధ వ్యాధులతో బాధపడేవారు , ఆర్ధిక కోర్టు , ఋణబాధల నివారణకు, విద్య, విదేశీయాన , ఉద్యోగ, వివాహ, సంతాన , అంయూన్యదాంపత్యం పొందుటకు చేయు ఉద్యోగ, వ్యాపారాములలో ఉన్నత స్తానం పొందుగూరు భక్తులందరూ మరియు ఆశ్లేషా, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలలో జన్మించినవారు , వృషభ, మిధున , కన్య , వృశ్శిక, మీనా రాశుల వారు, 5 ,7 ,14 ,16 ,23 ,25  తీదీలలో పుట్టినవారు మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని ఆరాధించి సకల శుభాలను పొందగలరు.

మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయములో స్వామివారికి సుప్రభాతసేవ , అభిషేకము, లక్ష్మీ గణపతి హోమాలు, చతురావృత్తి తర్పణాలు, సహస్రనామార్చన , దూర్వాయుగ్మ పూజలు నిర్వహించబడును.

మాసూత్సవములో భాగంగా ప్రతీ సంకష్టహర చతుర్థి రోజున విశేష మైన పూజలు చేయబడును.

ప్రతి సంవత్సరం బాధ్రపదమాసములో మారకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి నవరాత్రి మహోత్సవములు , కార్తీకమాసములో ధాత్రీనారాయణ , సామూహిక సత్యనారాయణ వ్రతములు భక్తులచే స్వయంగా ఆచరింపజేయుదురు.

ప్రతి సంవత్సరం చైత్ర బహుళ విదియ నుండి పంచమి వరకు మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవముగా నిర్వహించబడును.

CONTACT INFO

Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015 

SOCIAL MEDIA