Marakatha Sri Laxmi Ganapathi Devastanam

మరకత శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానము

“పూర్వ జన్మకృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే

తచ్చాంతిః ఔషదైః దానైః జప హోమ క్రియాడిభిః

అని శారీరక మానసిక లోపాలకు శాంతిగా, ఔషధ సేవనం, దానాలు, జపాలు, హోమాలు చేయడం భారతీయ సంప్రదాయంగా ఉంది. మానవ జీవితంపై నవగ్రహల దశ, అంతర్దశ స్థితుల ఆధారంగా చూపే దుష్ప్రభావాలను దూరం చేసుకోవడానికి మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కల సువర్ణ, సపత్ని, సవాహన పూర్వక నవగ్రహాలకు ప్రతి శనివారం అభిషేకం, శనికి తైలాభిషేకం, దానాలు మరియు అర్క, మోదుగ, చండ్ర, రావి, మేడి, జమ్మి, మామిడి, గరిక, మర్రి, ధర్భ, ఉత్తరేణి సమిధులలో నవగ్రహ హోమాలు యథా శాస్త్రీయంగా గురువుగారి ఆధ్వర్యంలో  నిర్వహించబడును.

గ్రహ సంచారాన్ని బట్టి గ్రహాధిపత్యకాలంలో సవర్ణ, సపత్ని, సవాహన పూర్వక నవగ్రహాలను అర్చించే జాతకులకు అన్ని ఈతి బాధలు తొలుగుతాయి.

సవర్ణ, సపత్ని, సవాహన పూర్వక నవగ్రహాలు

గ్రహం పేరు

రంగు

ధర్మపత్ని పేరు

వాహనం

దానాలు

ఫలితము

సూర్యుడు

ఎరుపు

ఉషా, ఛాయ

సప్తాశ్వరధం

గోధుమలు, గోధుమపిండి, ఎర్రని వస్త్రాలు, రాగి, బంగారు వస్తువులు

అనారోగ్య, మానసిక బాధలు తొలుగును,

పదోన్నతులు, మనఃశాంతి

చంద్రుడు

తెలుపు

రోహిణి

లేడి

బియ్యం, వెండి,

తెల్లని వస్త్రాలు

నేత్ర, మానసిక బాధల నివారణ, సంతానం, మనఃశాంతి

అంగారకుడు

ఎరుపు

శక్తిదేవి

గొర్రె

ఎర్ర వస్త్రాలు, కందులు, కందిపప్పు

ఋణ విముక్తి, శత్రుబాధ నివారణ

బుధుడు

ఆకుపచ్చ

జ్ఞాన శక్తిదేవి

సింహం

పెసలు, ఆకుపచ్చని దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మందులు, పెసరపప్పు

వృత్తి, వ్యాపారాభివృద్ధి, వ్యవహార నైపుణ్యం,

ధనలాభం

గురుడు

పసుపు

తారాదేవి

ఏనుగు

పుస్తకాలు, బంగారు వస్తువులు,

పట్టు బట్టలు పండ్లు,

శనిగలు, శనగపప్పు,

తీపి వస్తువులు

విద్య, జ్ఞానం,

అధికారం, కీర్తి

శుక్రుడు

తెలుపు

సుకీర్తి దేవి

గుర్రం

బొబ్బర్లు, చక్కెర, పూలు, ఆవు, అలంకరణ వస్తువులు

కార్యసిద్ధి, వివాహాది

శుభకార్యాలు, ధనప్రాప్తి

శని

నలుపు

జ్యేష్టా దేవి

కాకి

నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులు, సిమెంట్, నువ్వుండలు, నేరేడు పండ్లు

ఆరోగ్యం, పదోన్నతి, దీర్ఘాయువు

రాహు

దూమ్రవర్ణం

కరాళీదేవి

సింహం

మినప్పప్పు, దుంపలు, ఆవాలు

భయాందోళనలు తగ్గును, ధనప్రాప్తి

కేతు

దూమ్రవర్ణం

చిత్రా దేవి

గ్రద్ద

ఉలవలు, మిక్స్డ్ కలర్  వస్త్రాలు, ఆహార పదార్థాలు

సర్పభయాలు, దైవశక్తి,  మోక్షప్రాప్తి

పూజా సమయము: శనివారం ఉ|| 5:00  గం|| లకు

CONTACT INFO

Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015 

SOCIAL MEDIA