Marakatha Sri Laxmi Ganapathi Devastanam

మరకత శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానము

సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో – ఉ|| 7:00  నుండి 8:00  గం. ల వరకు , బుధ, శని, ఆదివారాల్లో – సా||  7:00  నుండి 8:00  గం. ల వరకు స్వామి వారికి సహస్రనామార్చన నిర్వహించబడును.

ఆది ప్రణవరూపుడు, పరబ్రహ్మస్వరూపుడై , షోడశకళానిధియై , విశ్వమంతా వ్యాపించియున్న మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి భక్తితో షోడశోపచార పూజలు నిర్వహించుట ద్వారా అనగా ధ్యానము, ఆవాహనము, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానము, పంచామృతాభిషేకం, ఉత్తరీయము, గంలేపనములు, కిరీటాభరణములు, పసుపు , కుంకుమ, అక్షత, సూపా, దీప, నైవేద్య, తాంబూలములు, సహస్రనామ స్త్రోత్రము , చత్ర , చామర, నృత్య, గీత, ఆశ్వ, మంత్రపుష్ప సమస్త రాజపచారాది పూజాది క్రియలలో భక్తిగా అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయి.

త్రిపురాసుర సంహారానికి ముందు శివుడు , విఘ్నాధిపతిని ప్రార్ధించగా ఎం గణపతే తన సహస్రనామాలను స్వయంగా ఈశ్వరునికి చెప్పాడని గణేశ పురాణంలో చెప్పబడింది. అటువంటి మహిమాన్పితమైన మరకత శ్రీ లక్ష్మీ గణపతి సహస్రనామార్చనను , ఆశ్లేషా ,జ్యేష్టా, రేవతి నక్షత్రాలవారు, వృషభ , మిధున, కన్యా, వృశ్శిక, మీనా రాసుల వారు, 5,7,14,16, 23,25 తేదీలలో జన్మించిన భక్తులు పాల్గొని పూజించి, ఆరాధించిన వారికి చతుర్విద ఫల పురుషార్ధములనిచ్చి , అష్టైశ్వర్య, అభీష్ట, కార్యసిద్ధిని కలిగించి, పూర్వ జన్మ పాప కర్మలను తొలిగించి కాళీ మృత్యు భయ దోషాలను హరించి , మనః శాంతిని, ఆ నందాన్ని కల్గించునని ముద్గల పురాణములో చెప్పబడింది.

“శ్రవణం కీర్తనం విష్ణు:  స్మరణం పాదసేవనమ్ అర్చనం|

 వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనమ్”

అని వేదవ్యాసుడు భాగవతంలో చెప్పిన నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన “సహస్రనామార్చన” ద్వారం అతిశీఘ్రముగా మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి పరిపూర్ణ కరుణా కటాక్షములను పొందవచ్చును.

CONTACT INFO

Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015 

SOCIAL MEDIA