Marakatha Sri Laxmi Ganapathi Devastanam

మరకత శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానము

“అన్నాశ్రితాని భూతాని అన్నం ప్రాణమితి శృతిః

తప్మాదన్నం ప్రదాతద్యం అన్నం పరమం హవిః

అన్నదానం సమం దానం త్రిలోకేషు నవిద్యతే”

అన్నం పర బ్రహ్మ స్వరూపమని వేదాలు ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి. అన్నం సర్వజీవాధారం అటువంటి అన్నాన్ని సకల శక్తులను, సర్వవ్యాపకత్వాన్ని కల్గి ఆదిపురుషుడైనట్టి, సస్యకారకుడైన మరకత శ్రీ క్ష్మీగణపతి దేవాలయానికి అన్నార్తులై వచ్చిన వారందరిని శివస్వరూపులుగా భావించి, వారి ఆకలిని తీర్చడానికి అన్నప్రసాద విరాళాలు ఇచ్చేవారంతా సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపాలే అగుదురని భావించి “మరకత శ్రీ లక్ష్మీ గణపతి అన్నప్రసాదం ట్రస్టు” ద్వారా ప్రతిరోజు దేవాలయములో (సుమారు 500మందికి పైగా  ) మరియు  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కల చిలకలగూడ చౌరస్తాలో(సుమారు 4500మందికి పైగా) భక్తులకు అన్నప్రసాద వితరణ కావించబడుచున్నది.

 

“ఆర్థిక, నష్ట ద్రవ్య, గృహ, వాస్తు, శల్య, అనారోగ్య నర దృష్టి, నవగ్రహ దోషాలతో సతమతమయ్యే వారు మరకత శ్రీలక్ష్మీ గణపతి స్వామి వారి కొలువులో అన్నదానం చేసిన భక్తులకు ఏడేడు తరాలు ధన, ధాన్య, పుత్ర, పౌత్రాభివృద్ధిని పొందుటకు స్వామి వారి దర్బారు సేవలో అన్నప్రసాద దాతలకు వేద ఆశీర్వచనం ఇవ్వబడును.

2016  వ సంవత్సరం నుండి ప్రతీ రోజు జంట నగరాల్లోనే, నిత్యా అన్న ప్రసాద వితరణను చేపట్టిన ప్రధమ దేవాలయమే కాక  కరోనా కష్టకాలములో 8-5 -2020  నుండి అన్నార్తుల క్షుద్భాదను ఈ రోజు వరకు కూడా నిరాటంకముగా , నిర్విఘ్నంగా తీర్చడంలో ప్రధమంగానే ఉన్నది.

CONTACT INFO

Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015 

SOCIAL MEDIA