ఉ|| 8:00 గం|| ల నుండి 9:00 గం|| ల — సోమ , మంగళ, గురు, శుక్రవారము
మ || 12:00 గం|| ల నుండి మ || 1:౦౦ గం|| — ప్రతి రోజు
స్వామి వారికి గకార అష్టోత్తర శతనామ స్తోత్ర పూర్వకముగా గణపతికి ప్రీతికరమైన ఎర్రని పుష్పాలు ,
దూర్వాయుగ్మలలో శాస్త్రోక్తముగా పూజ నిర్వహించబడును.
“సహస్ర పరమాదేవి శాతమూలా శతాంకురా|
సర్వగం హారతు మే పాపం దుర్వాదుస్వప్ననాశిని “
అని కృష్ణయజుర్వేయం లో తైతరీయ అరణ్యకంలో దూర్వాసూక్తం దూర్వాయుగ్మల మహిమను తెలిపినది.
మూలాధార చక్రానికి అధిపతియైన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని ఆశ్లేషా, జ్యేష్టా, రేవతి నక్షత్రాల వారు , వృషభ, మిధున, కన్యా, వృశ్చిక, మీనా రాశుల వారు 5,7, 14,16,23,25 తేదీలలో జన్మించిన వారు దూర్వాయుగ్మ దళాలతో పూజించడం వలన కుండలినీ శక్తిని జాగృతం చేసి శరీర వ్యవస్థకు స్వస్థత చేకూర్చి , అశాంతిని పోగొట్టి సరైన ఆలోచనా దృక్పధంతో స్థిర జీవితాన్ని, అభీష్టసిద్ధిని , పూర్వ జన్మల పాపాలను పోగొట్టి సర్వసంపదలను వయోషాభివృద్ధిని కలిగిస్తుంది.
దూర్వాదళంలో ఒక శాఖ శివుణ్ణి, ఒక శాఖ పార్వతీదేవిని , ఒక శాఖ గణపతిని సూచిస్తుంది. క్షీరసాగర మధనం జరిగినపుడు ఉద్బవించిన అమృత కలశాన్ని దూర్వాయుగ్మలపై ఉంచినపుడు కలశం నుండి ఒలికిన అమృతబిందువల్ల దూర్వాయుగ్మాలకు ఇంత అద్భుతమైన వైద్య, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నది.
పూర్వం సామ్యమునిపురంలో యముడు దేవతల నందరిని ఆహ్వానించి ఏర్పాటుచేసిన మహోత్సవంలో దేవనర్తకి తిలోత్తమ నాట్యం చేసింది. యముడు ఆమెను చూసి మోహించడం వల్ల అతని రేతస్సు నుండి అనలాసురుడు అనే రాక్షసుడు మంటలను విరజిమ్ముతూ ఉద్భవించాడు.
ఆ మంటలకు ప్రపంచమంతా హాహాకారాలు చేస్తూ, విష్ణుమూర్తిని వేడుకొనగా, వినాయకున్ని ప్రార్ధించమని ఉపాయం సూచిస్తాడు. దేవతల ఆర్తితో గణపతిని శరణు వేడగా, గణాధిపతి యైన గణపతి కొండంతగా పెరిగి అనలాసురున్నిమ్రింగివేసి బ్రహ్మాండాన్ని రక్షిస్తాడు. అపుడు గణపతికి కంఠంలో పెరిగిన తాపాన్ని తగ్గించడానికి విష్ణు మూర్తి పద్మాలను, ఇంద్రుడు చంద్రకళలను , శివుడు ఆదిశేషున్ని, సిద్ధి బుద్ధులను ఇచ్చిన అతని తాపం తగ్గలేదు. ఈ విషయం తెల్సిన 80 వేల మంది ఋషులు ఒక్కొక్కరు 21 దూర్వాయుగ్మలను అనగా 16,80,000 దుర్వాలను స్వామికి సమర్పించి పూజించగా గణేశుని తాపం తగ్గింది. అప్పటి నుండి త్రిమూర్తులు , కుబేరుడు, ఇంద్రుడు దూర్వాయుగ్మాలతో స్వామిని పూజించడం వల్ల విద్య , ఉద్యోగ , వ్యాపార, వివాహ, సంతాన ప్రాప్తిని, సర్వ కార్య సర్వాభీష్ట సిద్ధిని పొందగలరు.
CONTACT INFO
Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015