Marakatha Sri Laxmi Ganapathi Devastanam

మరకత శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానము

శ్రీ విద్యా ఉపాసకులు బ్ర|| శ్రీ || డా || మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి  వాస్తు , ఆగమ, జ్యోతిష్య  శాస్త్ర  పండితులు.

బిరుదులు

——————

->వాచస్పతి

->లలాటరేఖా శాస్త్ర బ్రహ్మ

->ధార్మిక సార్వభౌమ

->సేవరత్న

-> CHIRST NEWTESTMENT DEEMD UNIVERSITY వారిచే “లలాటరేఖా శాస్త్రములో గౌరవ డాక్టరేట్ , బంగారుపతాక ప్రదానం

-> MOTHER THERESA WELFARE FOUNDATION OF INDIA వారిచే “COVID Warriors of Telengana State”  certificate మరియు cyberabad police commissioner V.C Sajjairiar గారిచే సన్మానం

పరిచయం

నామధేయము : బ్ర|| శ్రీ || డా || మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి

తల్లి – తండ్రి  : క్రీ || శే ||   బ్ర|| శ్రీ రామశాస్త్రి గారు , శ్రీమతి రాములమ్మ దంపతుల ఐదవ సంతానము.

ప్రస్తుత నివాసం: ఇం. నెంబర్ . ౩౦-857, జ్యోతి నిలయము, శివకానాజీగూడ , సికింద్రాబాదు -15

జనన తేది : 09-04-1967, స్వస్తిశ్రీ  కీలక నామ సం|| పుష్య శు || సప్తమి

విద్య : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , మోత్కూరు లో S.S.C  వరకు

ఉన్నత విద్య : ఉస్మానియా యూనివర్సిటీ 6 విభాగాలలో P.G పట్టభద్రులయ్యారు. అందు నాలుగు స్వర్ణపతాకములు డిస్టింక్షన్లు మరియు “ఉత్తర రామ చరిత్రము పరిశోధన” పై Ph.D  ని సాధించారు

ఉద్యోగం: రైల్వే జూనియర్ కళాశాల – సికింద్రాబాద్ సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేయిచున్నారు

బిరుదు ప్రదానం :

———————

  1. 2003 నుండి రైల్వే జూనియర్ కళాశాల విద్య సంస్కృత భాషలో ఉన్నత విద్యా ప్రమాణాలు ఉత్తమ ఫలితాలు సాధించునందుకు గాను దక్షిణ మధ్య రైల్వే వారు 2008 , 2014  సం||  “అకాడమిక్ ఎక్సలెన్సీ అవార్డు” ను “రైల్ సప్తాహ్ (జి.ఎం) అవార్డు 2015  లో అందుకున్నారు.

2 . శ్రీ వాగ్దేవీ సంస్కృత భారతీ సంస్థ “హైదరాబాద్ వారిచే 2014  వ సం|| లో శ్రీ శ్రీ శ్రీ అభినవోద్ధండ శ్రీ విద్యారణ్య నృసింహస్వామి పుష్పగిరి పీఠాధిపతుల కారకమలములచే “వాచస్పతి” బిరుదును అందుకున్నారు.

౩. “SMS  చారిటబుల్ ఫౌండేషన్ ” వారిచే “ధార్మిక సార్వభౌమ” బిరుదును పొందారు.

  1. సర్. సి.వి. రామం అకాడమీ (సేవా సాంస్కృతిక సంస్థ) వారు 2018 వ సం|| లో  సీవరత్న అవార్డును అందించారు.

5 .  సర్. సి.వి. రామం అకాడమీ  (సేవా సాంస్కృతిక సంస్థ) వారు 2019   వ సం|| లో లలాటరేఖా శాస్త్ర బ్రహ్మ” అను బిరుదు తో సత్కరించారు.

గౌరవడాక్టరేట్: CHRIST  NEWTESTMENT DEEMD  UNIVERSITY  వారిచే 2018  వ సం|| లో లలాటరేఖా శాస్త్రములో గౌరవ డాక్టరేటును ఇచ్చి బంగారు పతకంతో సత్కరించారు.

దేవతోపాసన: నిత్యసప్త పారాయణము, శ్రీచక్రార్చన , నవావర్ణవిధతో దేవి దర్శనము పొంది, బ్ర || శ్రీ || వే|| కొల్లావజ్ఝల సూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యుల శిష్యరికంలో  లలాటరేఖాశాస్త్రములో పరిపూర్ణత్యమును సాధించి భూత , భవిష్య, వర్తమాన ఫలితాలను అందించే కళానిధి.

ఓం శ్రీ మారక లక్ష్మి గణపతయే నమః

శ్రీ సాయి నాధాయ నమః

—————————————————

పూజ్యశ్రీ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి గారు , వేదపండితులు శ్రీ దేవి ఉపాసకులు , లలాట శాస్త్ర నిపుణులు , విద్యావేత్త , సంఘసేవకులు , ఆధ్యాత్మిక ప్రచారకులు, ‘వాచస్ప్రతి’ బిరుదాంకితులు

లలాట శాస్త్ర నిపుణులు పూజ్య గురువులు శ్రీ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి గారు లలాట శాస్త్రనిపుణులు వీరు కేరళ రాష్ట్రం లో శ్రీ కొల్లావజ్జల సూర్యనారాయణ సాత్రి గారి వద్ద ఈ విద్యను అభ్యసించారు.

వాచస్ప్రతి బిరుదు ప్రధానం :

     2014  సంవత్సరం వసంత పంచమి ఉత్సవాలను పురస్కరించుకొని , సికింద్రాబాద్, దీన్దయాల్నగర్ లో విజయ వినాయక ఆలయంలో, శ్రీ వాగ్దేవి సంస్కృత భారత ఆధ్యాత్మిక ధార్మిక సంస్థ వారు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యానృసింహ భారతి స్వామి వారి చేతుల మీదుగా పూజ్యశ్రీ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి గారికి ‘వాచస్ప్రతి’ బిరుదు ప్రధానం చేసారు.

  ‘వాచస్ప్రతి’ పూజ్యశ్రీ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి గారి జీవన విధానము , జీవన  ప్రమాణము  జీవన గమనము , జీవిత లక్ష్యాలను ఒక్కసారి పరికించి చుస్తే…

కారణ జన్ముడు

——————————————–

  ఈ భూమి మీద అందరూ ఏవో కారణంతోనే జన్మిస్తారు. కానీ ఎవరైతే కార్య- కారణ సంబంధం తెలుసుకొని ఆచరించి (ఆచరిస్తూ) జీవిస్తుంటారో వారే ‘కార్యజన్ములు’.

   నువ్వు ‘కారణ జన్ముడివి’  రా అని వా గురుదీవులచే ఆశీర్వదింపబడి, వారి ద్వారానే ఈ జన్మకు కారణం తెలుసుకొని ఆ మార్గంలో కార్యోన్ముఖులై ‘కాయాక సేవయే కాత్యాయని సేవ’ అని నమ్మిన సిద్దాంతంలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. శ్రీ పూజ్య గురువులు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి  గారు.

దేవి ఉపాసకులు , లలాట శాస్త్రనిపుణులు


  పూజ్య గురువులు శ్రీ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి  గారు 1968  డిసెంబర్ 25  వ తేదీన అనగా శ్రీ కీలన నామ సంవత్సరం పుష్య శుద్ధ సప్తమి బుధవారం అది హిందువులకు అతి పవిత్రమైన ధనుర్మాసము కాకుండా ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం మరియు క్రీస్తు పుట్టిన పవిత్రదినం.

 ఆ రోజూ వీరు నల్గొండ జిల్లా , మోత్కూరు మండలం , బిజిలాపురం గ్రామంలో ఒక నిరుపేద సాంప్రదాయ (వైదిక) బ్రాహ్మన కుటుంబంలో శ్రీ మోత్కూరు రామశాస్త్రి, రాములమ్మ గార్లకు 5 వ సంతానంగా జన్మించారు. వీరి తండ్రిగారు కూడా గొప్ప దేవి ఉపాసకులు. ఆయన దేవి పూజ చేసి జోలెపట్టుకొని, కేవలం ఐదు ఇళ్లలో మాత్రం భిక్షచేసి , అది ముడిపదార్థాలు మాత్రమే తీసుకొనేవారు. అవి తెచ్చి వండి అమ్మవారికి నివేదన చేసి, పిల్లలకు పెట్టి, మిగిలితే ఆ భార్య భర్తలు తినేవారు. లేకుంటే నీళ్లు త్రాగి పడుకొనే వారు. అంతటి నిరుపేద కుటుంబం శ్రీ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి గారిది.

ఆ పరిస్థితులలో వీరు తన 6 వ ఏటనే గ్రామంలో పశువుల కాపరి (గోపాలుడు) గా పనిచేయటానికి నియమింపబడ్డారు. అప్పటి వీరి జీతం కేవలం కుండ్ వడ్లు మాత్రమే. (20  కేజీల వడ్లు). 6 వ తరగతి చదువుతున్న రోజుల్లో ఒకరోజు ఒక ఆవు మేతకు ఇంతకు పంపించినా వెళ్లట్లేదు. వెళ్లకుండా అది ఒక చెట్టు క్రింద వచ్చి నిలబడుతూ వుంది. ఆ ఆవుని ఎంత అదిలించి ప్రక్కకు పంపించినా అది మళ్ళీ ఆ చెట్టు కిందనే వచ్చి నిలబడుతూంది. బహుశా దీనికి ఏమైనా జబ్బు చేసిందా అనుకోని, కానీ ఆ చెట్టుకిందే ఎందుకు నిలబడుతుందా అని ఆలోచిస్తూ ఆ ఆవుని పశువులశాలలో కట్టేసి దానికి మేతవేసి స్కూల్ కి టైం అవుతోందని ప్రక్కనే వున్నా బావి దగ్గర స్నానం చేసి, వారికి ఉన్న ఒకే ఒక్క జత బట్టలు వాటిని పిండుకొని ఏవ్ కట్టుకొని , ఇంటికి వెళ్తుంటే దారిలో ఆ ఆవు అదే చెట్టు కింద నిలబడి ఉంది. అదేంటి ఇప్పుడే కదా దాన్ని శాలలో కట్టేసి వచ్చాను. మళ్ళీ ఇక్కడ ఉందేంటి అని ఆశ్చర్యపోతూ దాని దగ్గరకు వెళ్లగా అప్పుడు శ్రీ పూజ్య గురుదేవులు ఒక అలౌకికమైన స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ స్థితి లో వీరికి ” ఆ జగన్మాత గోమాత రూపంలో బీజాక్షరీ మంత్రాలను ఉపదేశించింది”  అంతలో వీరు లౌకిక స్థితికి చేరుకున్నారు. ఛ.. అది ఆవేంటి మాట్లాడమేంటి అనుకున్నారు. కానీ ఆవు ఉపదేశించిన మంత్రాలు  శ్రీ శాస్త్రిగారి హృదయాంతరాళంలో నిక్షిప్తమైపోయి ఆ మంత్రాలనే మననం చేసుకుంటూ ఆ గోమాతను గోశాలలో కట్టేసి, ఇంటికి వెళ్లి ఈ విషయం తన తండ్రి గారికి చెప్పారు. వారు అదంతా నీ ఆలాపన (భ్రమ) లేరా అన్నారు. దాంతో ఈ విషయాన్నీ ఎవ్వరికి చెప్పలేదు కానీ మంత్రాన్ని మాత్రం మననం చేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఆ ఆవు ఆ రోజూ రాత్రి నుండి కనిపించడం లేదు (మాయమై పోయింది ). ఎంతమంది ఎన్నో రకాలుగా వెతికినా కనపడలేదు.

 శ్రీ శాస్త్రి గారు వారి గ్రామంలో 7 వ తరగతి ముగించుకొని 8 వ తరగతి చదవడం కోసం 15  కి.మీ. దూరంలో ఉన్న అమ్మనబ్రోలు గ్రామానికి నడిచివెళ్లి వస్తూవుండేవారు. ఒక రోజూ వీరి స్నేహితుడు శ్రీ చంద్రశేఖర్ గారితో వస్తూవుండగా , దారి మధ్యలో ఉన్న ఒక ఇరు (మూసీనది) ప్రక్కనే వున్న గుట్టపై గల గంగాదేవి ఆలయం సమీపంలో మళ్ళీ ఆ గోమాత దర్శనమిచ్చింది. అది భ్రమ ఏమో అనుకోని తన స్నేహితుడికి చుగా వారికి కూడా కనిపించింది. ఇద్దరూ దగ్గరకి వెళ్లి చూద్దురు గదా ఆ మాట మళ్ళీ మాయమైపోయింది (కనుమరుగైపోయింది).

శ్రీ శాస్త్రిగారు అమ్మనబ్రోలు గ్రామంలో తన 8 వ తరగతి పూర్తిచేసుకొని , 9 వ తరగతి చదువుకొనే నిమ్మిత్తం నార్కెట్పల్లికి దగ్గర ‘వెలిమినేడు’ గ్రామానికి వచ్చారు. అక్కడే మన పూజ్యు గురువులు శ్రీ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి గారికి వారి పూజ్య గురువులు శ్రీ మెగ్గిరాల లక్ష్మీ నర్సయ్య శాస్త్రి గారితో సాంగత్య ఏర్పడింది. వీరి గురువు గారి స్వస్థానం గుంటూరు జిల్లా ఇటుకుల పాడు గ్రామం కాని వీరు అన్నయ్య గారింట్లో ఉండేవారు. వీరు గొప్ప రామభక్తుడు, గొప్పయోగి వీరిని కొందరు పిచ్చివాడు అనుకునేవారు. కాని అందురు గొప్పవాడు అనుకునేవారు. వీరి గురువుగారు తన కాళ్ళు పట్టుకొని పిసికుతూఉంటే మహానందపడి గురకపెట్టి నిద్రపోతూ ఉండేవారు. ఆ సందర్భంలో ఒకసారి గురువు గారు గురక పెట్టి నిద్రపోతూ ఆశ్చర్యపోయారు. అంతటి మహనీయలు శ్రీ లక్ష్మీ నర్సయ్య శాస్త్రి గారు వెలిమినీడు గ్రామానికి 2  కి.మీ. దూరంలో శంభులింగేశ్వర ఆలయం ఉండేది. ఆ ఆలయంలో పూజలు చెయ్యడానికి అందురు భయపడేవారు. ఎందుకంటే అక్కడ ఉండే శివలింగాన్ని చుట్టుకొని ఒక ఐదు తలల పాము ఉండేది. కానీ వీరి గురువు గారు మాత్రం ఆ ఆలయంలోకి వెళ్లి శివుడికి అభిషేఖం చేసి శిలింగంతో పాటు , ఆ పాముకి కూడా పూజ చేసి వస్తూండేవారు అంతటి పారమభక్తులు వారు. ఈ విషయం కూడా మన గురువుగారు దగ్గరుండి చూసి తరించారు.

పూజ్య మన గురుదేవులు పుట్టని పూర్వం

శ్రీ శాస్త్రి గారు గురుదేవులు ఆ శంభులింగేశ్వరస్వామి ఆలయం దగ్గర గల ఆంజనేయ స్వామి వేగిరం పక్కన చింతచెట్టుకింద అన్నపానీయాలు , నిద్రాహారాలు లేకుండా 6  సంవత్సరముల పాటు తపస్సు చేశారు. ఆ సందర్భంలో వీరి భార్యగారు వీరి తపస్సు భగ్నం చేసారు. అప్పుడు అత్యంత కోపోద్రిక్తులై వెంటనే నువ్వు రక్తం గ్రక్కుకొని ఛస్తావ్ అని శపించారు. ఆవిడ అక్కడిక్కడే మరణించింది. ఆ అంత్యక్రియలు  అన్ని ముగించుకున్నారు. వీరి గురువు గారికి బావమరిది అయినా మన గురుదేవుల తండ్రి గారు శ్రీ రామ్ శాస్త్రి గారు అప్పుడు అక్కడే ఉన్నారు. అప్పటికి వీరి సంతానం లేదు, తన బావగారికి వీరు తనకు సంతానప్రాప్తి ఉందొ లేదో అని అడగగా వారు నీకు 16 మంది సంతానం కలుగుతారని, వారిలో ఎనమండుగురు బ్రతుతారని వారిలో  5వ  సంతానం , (మెగా సంతానంలో 2  వ వారు) సన్యాసం స్వీకరించి , ఆశ్రమం కడతాడు, హాస్పిటల్ కడతాడు, అమ్మవారు ఆలయం నిర్మించి దాని ప్రక్కనే ఒక గోశాల నిర్మిస్తాడని, ఆ గోశాలలో ఒక గోమాతకి లీగా దూడగా నేను జన్మించి త్రీ రోజులు నీ కొడుకు అప్ప వారికి చేసే పూజలు చూసి తరిస్తేనే గని నాకు మోక్షప్రాప్తిలేదని చెప్పారు.

ఆ 5 వ సంతానం మరెవరోకాదు మం పూజ్య గురువులు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి  గారు దేవీ ఉపాసకులు లలాట శాస్త్ర నిపుణులు.

మన పూజ్యు గురువులు శ్రీ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి  గారికి వారి గురువు గారు దేవి మంత్రోపదేశం చేస్తారు. ఆ సందర్భం లో మన శాస్త్రి గారు “గురువు గారు ఈ మంత్రాలు నాకు వచ్చండి” అన్నారు. ఆచ్చర్యపోయిన ఆయన గురువుగారు ఎలా తెలుసు అని అడిగారు. అప్పుడు పూజ్యశ్రీ శాస్త్రి గారు తనకు గోమాత మంత్రోపదేశం చేసిన విషయం చెప్పారు. అది విని వారి గురువు గారు కళ్ళుమూసుకొని ధ్యాన (మనో) నేత్రంతో ఆ విషయాన్ని కనుగొని , మన శాస్త్రి గారిని “కారణ జన్ముడివి” రా అని దీవించారు.

తర్వాత కాలంలో వెలిమినేడు గ్రామంలో చదువు పూర్తి చేసుకొని , పై చదువులకై హైద్రాబాద్ నగరానికి వచ్చారు శ్రీ శాస్త్రి గారు. అప్పటికి వారికి చదువుకొనే స్తొమత లేదు. అప్పుడు వారు భేగంపేట రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ దగ్గర ఉప్పర పని చేసుకుంటూ రోజు కూలీ 2  రూపాయిలు చొప్పున , పురానాపూల్ అభ్యుదయ కాలేజీలో ఇంటర్ చదువుకునేవారు. అప్పటికి వీరి నివాసం ఫ్లైఓవర్ కిందే , రాత్రిపూట ఆ ఫ్లైఓవర్ కిందే లక్ష్మీ నారాయణ హృదయ పారాయణ, చేసుకుంటూ ఉండేవారు. ఆ పారాయనే వారి లక్ష్యం వైపు వెళ్లగలిగేలా చేస్తోందని వారి ప్రగాఢ విశ్వసం . అందుకే వారు మన అందర్నీ కూడా లక్ష్మీనారాయణ హృదయ పారాయణ చేయమని ప్రోత్సహిస్తూ ఉంటారు. మన పూజ్యా గురువులు చెప్పినట్లు మనం కూడా శ్రీ లక్ష్మీ నారాయణ హృదయ పారాయణం చేస్తూ మనం లక్ష్యాల వైపు అడుగులు వేద్దాం.

ఇళ్ళపాటికి శ్రీ శాస్త్రి గారు 6  పీజీలు చేశారు. అందులో 4  గోల్డ్ మెడల్స్ , 2  డిస్టిక్షన్ సాధించారు. ఒక డాక్టరేట్ కూడా పొందారు. అది కూడా గోల్డ్ మెడలే . ఇప్పుడు వారు మరొక ఫై. హెచ్ డి కూడా చేస్తున్నారు.

1992 లో  శ్రీ శాస్త్రి గారు  మొదట పి.జి చేసి షాదాన్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పని చేస్తూ ఉండేవారు. అప్పుడు వీరికి వివాహం చెయ్యాలని సంకల్పించి వీరికి చెప్పగా , తనకు వైవాహిక జీవితావు మీద ఆసక్తిలేదని , తన ఆలోచనలు, ఆశయాలు వేరని తిరస్కరించారు. అప్పుడు వీరి కుటుంబ సభ్యులు వీరి తమ్ముడికి వివాహం జరిపించారు.

తర్వాత కొంత కాలానికి 1995 సంవత్సరంలో వీరి అమ్మమ్మ గారు స్వర్గస్తులయ్యారు. అప్పుడు 11 వ  రోజు కార్యక్రమానికై వాళ్ళు ఊరు వెళ్లారు. అక్కడ వీరు బంధువు ఒకాయన శ్రీ శాస్త్రిగారితో ఎన్నో పెళ్లి సంబంధాలు మీ ఇంటి చుట్టూ తిరిగి వెళ్లిపోతున్నాయి నీకు ఆ అర్హత లేకుంటే ముందే చెప్పొచ్చు కదా అంటూ అవమానకర రీతిలో ఇబ్బందికర రీతిలో అన్నారు. ఆ ఇబ్బందిని తట్టుకోలేక వీరు వెంటనే బస్సు ఎక్కి హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. ఇదంతా వెరీ కుటుంబ సభ్యులు గమనించారు.

శ్రీ శాస్త్రి గారు అప్పట్లో అమీర్పేట ఆంజనేయస్వామి గుడి దగ్గర ఒక ఇంట్లో మెట్ల కింద ఒక చిన్నగదిలో నెలకు 100  రూ.లు అద్దె చెల్లించి ఉంటూ ఉండేవారు. వీరి అమ్మమ్మ గారి 11  వ  రోజు కార్యాక్రమాలు అవి ముగించుకుని వీరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెరీ దగ్గరకు వచ్చారు.

శ్రీ శాస్త్రిగారిని బలవంతంగా వీరి గురువు గారి దగ్గరాజు తీసుకెళ్లారు. తీసుకెళ్లి వీరి గురువుగారితో చుడండి వీడు పెళ్లి చేసుకోను అంటున్నాడు. ఊళ్లోనూ, బంధువర్గంలోను వీడికి ఎదో లోపం ఉంది అని నానారకాలుగా అనుకుంటున్నారు. అని వారితో విన్నవించుకున్నారు. అప్పుడుస్త్రీ శాస్త్రిగారి యొక్క గురువుగారు వీరితో “ఒరేయ్, నాయనా నువ్వు పెళ్లి చేసుకోను అంటే కుదరదుగా, నువ్వు పెళ్లి చేసుకోవాలి.నీకు మేథమేటిక్స్ బాక్గ్రౌండ్ వున్న అమ్మాయి వస్తుంది. నీకు మీదట ఒక కూతురు పుడుతుంది. ఆ తర్వాత ఒక కొడుకు పుడతాడు. ఆ తర్వాత నీకు 40  ఏళ్ల వయస్సులో నీకు సెంట్రల్ గోవేర్నమేంట్ జాబ్ వస్తుంది. ఆ తర్వాత నువ్వు కొన్నాళ్ళు ఉద్యోగం చేసి తర్వాత నువ్వు సన్యాసం తీసుకుంటావు. తీసుకొని ఒక ఆశ్రమం కట్టుకుంటావు ఆ ఆశ్రమంలోనే ఒక పెద్ద హాస్పిటల్ కడతావు. ఆ హాస్పిటల్ లో ఎంతో మందికి ఉచితంగా సేవ చేస్తూవుంటావు. ఆశ్రమంలో నే అమ్మవారి ఆలయం కట్టి, ఒక గోశాల ఏర్పాటు చేస్తావు. గోశాలలో ఒక ఆవుకి లేగదూడ నై నేను పుడతాను. నేను పుట్టి నువ్వు చేసే అమ్మవారి పూజలను ఒక మూడు రోజులు చేసి , అప్పుడు నేను అస్తమిస్తాను. అప్పుడు మా గురువుగారు పుట్టారు అని చెప్పి అందరికి పరిచయం చేస్తావు. ఆ లేగదోడని తీసుకెళ్లి ఆ అమ్మవారి ఆలయం ప్రక్కనే సమాధిచేసి, సమాధినే ఒక ఆలయంగా మార్చి గురువు ఆలయంగా పేరు పెట్టి గురు ఆలయంలో పూజలు చెయ్యడం మొదలు పెడతావు. అప్పటికి గాని నాకు మోక్షప్రాప్తి కలగదురా నాయనా. నువ్వు ఇప్పుడు పెళ్లిచేసుకోనూ అంటే ఎలారా? నీ వల్ల ఇవన్నీ జరగకపోతే మోక్షప్రాప్తి లేదు అని పెళ్లి చేసుకోమని బ్రతిమాలారు.

అప్పుడు శ్రీ శాస్త్రి గారికి వారి గురువు గారు చెప్పినట్లే అన్ని జరుగుతూ ఉండటం వల్ల ఇక ముందు కూడా అలానే జరుగుతుందనే విస్వాసములో ఉన్నారు.

ఆధ్యాత్మికవేత్త , మానవతావాదియైన శ్రీ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి  గారు ప్రతి మానవుల్లో పరమాత్మ ఉంటాడని , ప్రతి మనిషికి సేవ చేస్తే అది పరమాత్మకు చెందుతుందని అంటారు. ప్రతీ మనిషిలోనూ ఆయన అమ్మవారినే చూస్తుంటారు. అందుకే ఎన్నో దేవాలయాలను నిర్మించారు.

అమ్మవారు కలలో కనబడి మరకత  శ్రీ లక్ష్మి గణపతి దేవాలయము సికింద్రాబాద్ లోని మిలటరీ డైరీ ఫారం రోడ్, కానాజీ గూడ 2016లో నిర్మించారు. “మరకత  శ్రీ లక్ష్మి గణపతి దేవాలయ ట్రస్టు” ద్వారా ధార్మిక , ఆధ్యాత్మిక ప్రవచనాలు, సత్ సాంప్రదాయాలు, సంస్కృతి తెలియజేస్తూ , సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రంథ ముద్రణ వంటి అంశాలు చేపడుతున్నారు.

“మరకత  శ్రీ లక్ష్మి గణపతి దేవాలయ ట్రస్టు” ద్వారా ప్రతీ నిత్యం దేవాలయములో మరియు చిలకలగూడ చౌరస్తా, సికింద్రాబాద్ లో 8 -5 -2020 నుండి కరోనా కష్టకాలంలో సుమారు 5000 మందికి అన్నార్తులకు షడ్రసోపేతమైన భోజనాన్ని అన్నప్రసాద వితరణను నిర్వహిస్తున్నారు.

“మోత్కూరు రామ శాస్త్రి  చారిటబుల్ ట్రస్టు ” ద్వారా మెడికల్ క్యాంపులను, పేదవారికి విద్యా , వైద్య సౌకర్యాలను అందిస్తూ , స్త్రీ, బాల ,వృద్ధులకు , చేయూత ఆర్ధిక సహాయం చేస్తూ,  “మానవసేవయే మాధవ సేవాయని”, “కాయికసేవయే కాత్యాయని సేవాయని” ప్రతీ వ్యక్తిలో తానూ ఉపాసించే దైవాన్ని దర్శిస్తూ సామాజిక సేవను చేయుచున్నారు.

CONTACT INFO

Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015 

SOCIAL MEDIA