Marakatha Sri Laxmi Ganapathi Devastanam

మరకత శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానము

సువర్ణ పుష్పార్చన సేవ

క్షీరసాగర మథనం జరిగినపుడు ఉద్భవించిన సముద్రరాజ తనయ శ్రీ మహాలక్ష్మి దేవిలోని ఒక అంశను విష్ణువాంశ సంభూతుడైన గణపతికి ఇవ్వడంతో లక్ష్మీ గణపతిగా అవతరించి, ఐశ్వర్య ప్రధాతయై మరకత శ్రీలక్ష్మీగణపతిగా ధనదాన్య సమృద్ధిని కలుగజేస్తున్నాడు.

 “హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రామ్” అంటూ శ్రీ సూక్తములో తెలుపబడిన, శోభనప్రదమైన, మనోహరమైన శ్రీమన్మహాలక్ష్మిని వామాంకముపై కూర్చుండబెట్టుకుని మరకత శ్రీలక్ష్మీ గణపతిని ‘స్వర్ణం పవిత్రమమలం స్వర్ణం పాప ప్రణాశనమ్’ అంటూ ఐశ్వర్యములో పవిత్రమైన, శ్రేష్ఠమైన, సువర్ణ పుష్పములతో 21 శుక్రవారములు పూజించుట వలన పూర్వజన్మ పాపకర్మము నశించి, స్థిరలక్ష్మీ కటాక్షం, అప్లైశ్వర్య ప్రాప్తి, మనఃశాంతి కలుగును.

పూజ జరుగు సమయము : ప్రతి శుక్రవారం గురుహోర సమయం ఉ: 10:00 గంటలకు ప్రారంభం.

మరకత శ్రీలక్ష్మీగణపతిఒడిగంటి సేవ

“సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే:”

ఓంకారరూపుడై, ఆది అంతములేని ఆనందమూర్తియై అప్లైశ్వర్య ప్రదాయకుడైన మరకత శ్రీ లక్ష్మీ గణపతికి, సర్వమంగళ స్వరూపిణియై, ధన, దాన్య, విద్యా, ఆరోగ్య, ఐశ్వర్య, జ్ఞాన, సంతాన, విజయ లక్ష్ములైన అష్టవిధ లక్ష్మీ దేవతల అనుగ్రహం అందించే మహాలక్ష్మిని భక్తితో పూజించి, సౌభాగ్య మంగళ శ్రీ ద్రవ్యములగు – పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం, చీర, ధోవతి, ఒడిబియ్యం సమర్పించి ఇంటిల్లిపాదికి సమస్త శుభాలు కలిగించమని, సర్వసౌభాగ్యాలు ఒసగమని ప్రార్థించడమే మరకత శ్రీ లక్ష్మీ గణపతి – ఒడిగంటి సేవ.

 పూజా సమయము : శుక్రవారం ఉ: 11:30 ని: లకు

మరకత శ్రీ లక్ష్మీ గణపతివస్త్రాలంకరణ సేవ

బుధ, ఆదివారము మరియు సంకటహర చతుర్థి రోజున తెల్లవారుఝామున ఉ: 5:00 ని: లకు వస్త్రాలంకరణ సేవలో పాల్గొను భక్తులు పట్టువస్త్రములు, ఒడిగంటి ద్రవ్యములతో ఆలయం చుట్టు ప్రదక్షిణచేసి స్వామివారిని దర్శించి, గోత్రనామాలతో పూజచేసి, పట్టువస్త్రములు, ఒడిగంటి ద్రవ్యములను (పసుపు, కుంకుమ, గంధం, గాజులు, ఒడిబియ్యం) వ్వాపార, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధికై, కీర్తి ప్రతిష్ఠలు, సకల శుభాలు కలగాలని స్వామివారికి సమర్పిస్తారు. వేద ఆశీర్వచనము, అభిషేక, హోమాల అనంతరం విశిష్ఠ ప్రసాద వితరణ జరుగును.

 పూజా సమయం: ఉ: 5:00 గం: లకు

 

మరకత శ్రీ లక్ష్మీ గణపతిచతురావృత్తి తర్పణమ్

సూర్యుడు నమస్కార ప్రియుడు. శివుడు అభిషేక ప్రియుడు,  విశువు అలంకార ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు అను శాస్త్రసమ్మతమైన నానుడి కలదు.

మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి ప్రియమైనది చతురావృత్తి తర్పణము. లక్ష్మీగణపతి మూల మంత్రము నందలి ప్రతీ అక్షరము  నాలుగు పర్యాయములు , అటులనే మూలమంత్రము మొత్తం ప్రత్యేకముగా 4సార్లు చొప్పున చేయవలెను. మొత్తం 444సార్లు మంత్రము ఆవృత్తమగును. ఈ విధముగా ప్రతిరోజు ఉదయము సూర్యోదయ కాలమున 40దినములు తర్పణములు చేయించిన మహత్తరమైన ఫలితములను పొందుకలరు.

ఆశ్లేషా, జ్యేష్టా, రేవతి నక్షత్రాల వారు , వృషభ, మిధున, కన్యా, వృశ్చిక, మీనా రాశుల వారు 5,7,14,16,23,25  తేదీలలో జన్మించిన వారు దేవాలయము నందు ప్రతీ రోజు ఋత్రికలచే జరిపే చతురావృత్తి తర్పణమును అనుష్ఠించుట వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోషాలు నశించి , ఆరోగ్యాన్ని, ఆయుష్యును పొందుతారు.

విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాభివృద్ధి , వాక్షాతుర్యం, సృజనాత్మక శక్తి, యశస్సు, ఐశ్వర్య ప్రాప్తి పొందుటకు మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి చతుర్వ్రుత్తి తర్పణముతో పాల్గొని తరించకలరు

పూజ సమయం : ఉ || 7 :00  గం|| లకు

CONTACT INFO

Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015 

SOCIAL MEDIA