మరకత శ్రీ లక్ష్మీ గణపతి ప్రతిష్టామహోత్సవము
“ప్రపంచంలో అరుదైన, అత్యంత విశిష్ఠమైన, మరకతము (పచ్చ-ఎమరాల్డ్) తో మలచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి మరియు సవర్ణ, సపత్ని, సవాహనపూర్వక నవగ్రహదేవాలయ దర్శనం సకలపాప వినాశనం- హామంగళప్రదం”
“భగవతి శ్రీలలితాపరమేశ్వరీదేవి” స్వప్న సాక్షాత్కార ఆదేశానుసారము, దేవి ఉపాసకులు, లలాటరేఖా శాస్త్ర నిపుణులు
బ్ర: శ్రీ: డా: మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి గారిచే నిర్మించబడిన ఆలయములో పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీస్వామి వారి కరకమలములచే మరకత శ్రీ లక్ష్మీ గణపతి మరియు సవర్ణ, సపత్ని, సవాహనపూర్వక నవగ్రహ విగ్రహములను చైత్ర బ: పంచమి 27-4-2016 వ సం:లో అంగరంగ వైభవంగా, నేత్రపర్వముగా ప్రతిష్టించబడి, భారతదేశంలో మహామహిమాన్విత గణపతి క్షేత్రములలో ఒకటిగా విరాజిల్లుచున్నది.
పూజా కార్యక్రమములు – వివరములు
సమయము | సేవలు | ఫలితము |
ఉ: 4:00గం: లకు | సుప్రభాతసేవ | ఆరోగ్యము, యశస్సు |
బుధ, ఆదివారము సంకట హర చతుర్థి ఉ: 4:30 గం: లకు ఉ: 5:00 గం: లకు | మరకత శ్రీ లక్ష్మీ గణపతి వస్త్రాలంకరణ సేవ | దైవానుగ్రహం, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధి, కీర్తి ప్రతిష్ఠలు, వ్యాపారాభివృద్ధి, మనఃశాంతి |
32 ఔషదీకృత ద్రవ్యాదులతో విశేష- అభిషేకము రాజోపచార పూజలు | ధనప్రాప్తి, ఆరోగ్య, సర్వాభీష్ఠ, సర్వకార్యసిద్ధి | |
హోమాలు బుధ, ఆదివారము, సంకట హర చతుర్థి ఉ: 8:00 గం: లకు | మోదకములు, తేనె, మల్లె, తామర పువ్వులతో గణపత్యదర్వణ శీర్షిపనిషత్, లక్ష్మీ గణపతి మూలమంత్రము, సంపుటిత శ్రీ దుర్గ, శ్రీ సూక్త పూర్వక మరకత శ్రీ మహాలక్ష్మీ హోమం | విద్య, విదేశీయాన, ఉద్యోగ, వివాహ, సంతాన, ఐశ్వర్యప్రాప్తి |
శుక్రవారము ఉ: 10:00 గం: లకు ఉ: 11:30 గం:లకు | సువర్ణ పుష్పార్చన | పూర్వజన్న పాప నివృత్తి, లక్ష్మీ కటాక్షం |
మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఒడిగంటి సేవ | అష్టలక్ష్ముల అనుగ్రహం, సౌభాగ్య ప్రాప్తి | |
శనివారం ఉ: 5.00 గం: లకు | నవగ్రహ అభిషేకములు, పంచామృతాభిషేకం, శనికి తైలాభిషేకం, నవగ్రహ హోమాలు | రాహు, కాల సర్ప, కుజ, నవగ్రహ దోషాల నివారణ |
దర్బారు సేవ బుధ, శుక్ర, ఆదివారం, సంకట హర చతుర్థి | రాజోపచార పూజల అనంతరం అన్న ప్రసాద దాతలకు వేద ఆశీర్వచనం | ఆర్థిక అనారోగ్య, గృహ, వాస్తు, నరదృష్టి, నవగ్రహ దోషాల నివారణ |
మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి 32 ఔషదీకృత ద్రవ్యాదులచే విశేష అభిషేకము
మానవుని బాధించే అంతఃశతృవులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాల నుండి రక్షించి భయాన్ని పోగొట్టి, ఆరోగ్యం, ఆనందాన్ని ఇచ్చి, అభీష్ఠసిద్ధిని కలిగించే మరకత శ్రీలక్ష్మీగణపతికి 32 ఔషధీకృత ద్రవ్యాదులతో జరిగే అభిషేక దర్శనం శ్రీకరం, శుభకరం
అభిషేక ద్రవ్యాలు
ద్రవ్యాలు | ఆధ్యాత్మిక ఫలితము | ఆరోగ్య ఫలితము |
పాలు | సర్వ సౌఖ్యాలు, ఆయుర్ధాయం | ఎముకల బలం |
పెరుగు | ఆరోగ్యం, యశస్సు, సంతాన ప్రాప్తి | జీర్ణ సంబంధిత వ్యాధులు |
తేనె | తేజోవృద్ధి | రోగనిరోధక శక్తి పెరుగుదల |
నెయ్యి | ఐశ్వర్య ప్రాప్తి | జ్ఞాపకశక్తి |
పంచదార | దుఃఖ నాశనము | శక్తినిస్తుంది |
బియ్యం పిండి | అప్పుల బాధలు | కార్బోహైడ్రేట్స్ |
లవంగాలు | ఒత్తిడి, ఆందోళన తగ్గును, సంతాన ప్రాప్తి | క్యాన్సర్స్, నొప్పులు, జీర్ణాశయం, దగ్గు నివారణ |
యాలకులు | సంతాన ప్రాప్తి | గుండె, షుగర్, బి.పి, ఆస్తమా, మానసిక సమస్యలకు |
జీడిపప్పు | దేహదారుఢ్యం | మంచి కొలెస్ట్రాల్, రోగనిరోధక శక్తి పెరుగుదల |
బాదం | జ్ఞాపకశక్తి, విద్య, ఉద్యోగం | చెడు కొలెస్ట్రాల్ తీసివేయును, గుండె ఆరోగ్యం |
పిస్తా | చురుకుదనం, జ్ఞాపకశక్తి | క్యాన్సర్, గుండె, ఎముకల జబ్బుల నివారణ |
కిస్మిస్ | అనోన్య దాంపత్యం, సంతాన ప్రాప్తి | మలబద్దకం, రక్తహీనత, క్యాన్సర్, కీళ్ళ వ్యాధులకు |
అరటిపండ్లు | ఒత్తిడి, ఆందోళన నివారణ, సహన శక్తి | గుండె, కిడ్నీ, జీర్ణ సంబంధ సమస్యల నివారణ |
దానిమ్మ | అనోన్య దాంపత్యం, సంతాన ప్రాప్తి | కీళ్ళు, గుండె, చర్మ క్యాన్సర్, అల్జీమర్స్ రాకుండా కాపాడును, రోగ నిరోధక శక్తి పెరుగును |
ఆపిల్ | ఒత్తిడి, చురుకుదనం | నరాల, శ్వాస, క్యాన్సర్ వ్యాధుల నివారణ |
జామ | ఆరోగ్యం | వ్యాధి నిరోధక శక్తి పెరుగును, మధుమేహ నివారణ |
ద్రాక్ష | విజయం | బిపి, షుగర్, గుండె సమస్యలకు, రోగనిరోధక శక్తి |
సపోట | ఒత్తిడి, ఆందోళన, వ్యాకులత నివారణ | కంటి ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెరుగుదల |
ఖర్జూర | శత హానిని హరింపజేయును | గుండె, బిపి, మలబద్దకం, కంటి వ్యాధుల నివారణ |
మామిడి | దీర్ఘ వ్యాధుల నివారణ | బిపి, అజీర్తి, రక్తహీనత, గుండె జబ్బుల నివారణ |
సంత్ర | ఆరోగ్యం, సంతాన సాఫల్యత | కంటి, డిప్రెషన్, మానసిక ఒత్తిళ్ళను తగ్గించును |
చెరుకు రసం | ధన వృద్ధి | కామెర్లు, కాలేయం, మలబద్దకం, కిడ్నీ సమస్యలకు |
పసుపు | ఆలోచనా శక్తి, అధికారులచే ఒత్తిడి తగ్గును | కీళ్ళు, బిపి, క్యాన్సర్, కిడ్నీ, కాలేయ సమస్యలకు |
కుంకుమ | మంగళప్రదం, సంకల్పబలం | ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుదల |
గంధం | సంతాన ప్రాప్తి, సంకల్పబలం, అధికారం | ఒత్తిడి, ఆందోళన నివారణ, మానసిక ప్రశాంతత |
విబూది | పాపాలు నశించును | శారీరక, మానసిక సమస్యల నివారణ |
చందనం | కీర్తి ప్రతిష్ఠలు | ఆందోళన, ఒత్తిడి తగ్గును |
వట్టి వేళ్ళు | సంతాన ప్రాప్తి, నాడీ రుగ్మతలు | మానసిక ప్రశాంతత |
కుంకుమపువ్వు | మానసిక ఉత్తేజం, ధాతుపుష్టి | జీర్ణశక్తి, రక్త ప్రసరణ, మోనోపాజ్ సమస్యల నివారణ |
కస్తూరి | రాజకీయ లబ్ధి, ఏకాగ్రత, గృహ కల్లోలాలు | ఒత్తిడి తగ్గిస్తుంది |
గరిక | నష్ట ద్రవ్య ప్రాప్తి | రోగనిరోధక శక్తి పెరుగుదల |
రుద్రాక్ష జలం | పుత్ర సంతానం | జీర్ణశక్తి, ఎముకల బలం |
కొబ్బరి నీరు | సకల సంపదలు | గుండె, బిపి, కీళ్ళ సమస్యల నివారణ |
మరకత శ్రీలక్ష్మీ గణపతి స్వామి అభిషేక దర్శనం, తీర్థ సేవనం – సకల కార్య జయం – మహా మంగళ ప్రదం
పూజా సమయం : ఉ: 5:00 గం:లకు, బుధ, ఆదివారము మరియు సంకట హరచతుర్థి రోజున.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మరకత శ్రీ లక్ష్మీగణపతి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు
ఆదివారం 9-4-2023 నుండి మంగళవారం 11-04-2023
ఆది ప్రణవ స్వరూపుడై, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై, ఈ జగమంతా వ్యాపించిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి స్వస్తిశ్రీ చాంద్రమానేన శోభకృత నామ సం: చైత్ర బ|| తదియ 9-4-2023 ఆదివారం నుండి పంచమి 11-4-2023 మంగళవారం వరకు అంగరంగ వైభవంగా, నేత్ర పర్వముగా ఆధ్యాత్మిక శోభతో భక్తి పూర్వకముగా జరిగే సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేయు అశేష భక్తజన వాహినికి ఇదే మా ఆహ్వానము.
బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందాన్ని ఇచ్చే లక్ష్మీగణపతి స్వామిని, ధనం, విద్య, వివాహ, ఆరోగ్య, వ్యాపార, యశో, శ్రేయ కారకుడైన బుధ గ్రహ రత్నమై ప్రపంచంలో అరుదైన, అద్భుతమైన మరకతమణి (పచ్చ-ఎంరాల్డ్) శిలతో మలచిన స్వామి దర్శనంతో నేత్ర, జీర్ణ, నరాల, వాత, కఫ, అశాంతి, ఒత్తిడి, కోర్టు, ఋణ, అకాల వైర దోషాలు తొలుగుతాయి.
ఆలయంలోని సవర్ణ, సపత్ని, సవాహన పూర్వక నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి రధోత్సవ, బ్రహ్మోత్సవ, హోమ కార్యక్రమాలలో పాల్గొనే భక్తులకు మరియు ఆశ్లేషా, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారు, వృషభ, మిధున, కన్యా, వృశ్చిక, మీనరాశుల వారు 5,7,14,16,23,25 తేదీలలో జన్మించిన వారందరూ స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొనిన నవగ్రహ దోషాలు, కలి దోషాలు నివారించబడి మాయా మోహాలు తొలిగి జ్ఞాన బీజాలు అంకురించి అభీష్ట సిద్ధి, ధనదాన్య సమృద్ధి ఆటంకాలు తొలిగి సకల శ్రేయస్సులు కలుగుతాయి.
గమనిక: బ్రహ్మోత్సవ సమయంలో స్వయంగా హోమ కార్యక్రమాలలో పాల్గొనిన భక్తులకు అక్షర లక్షలు
జపం చేయించబడిన మహిమాన్విత మరకత గణపతి లాకెట్ మరియు లక్ష్మీ గణపతి యంత్ర సహిత వెండి డాలర్ ప్రసాదంగా ఇవ్వబడును. సంప్రదించు ఫోన్ నెం : 99490 60885, 94409 87638, 95503 17277
బ్రహ్మోత్సవ కార్యక్రమ వివరాలు
9-4-2023 ఆదివారం సంకటహర చతుర్ధి | ఉదయం 4:00 గం:లకు మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి సుప్రభాతసేవ, విశేష అభిషేకం, కలశస్థాపన, గోపూజ, చతురావృత తర్పణాలు, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర స్వస్తి, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనం, దీక్షా ధారణ, మాతృకా పూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన. ఉదయం 11:00 గం:లకు – లక్ష్మీ గణపతి, కుబేర, నారసింహ, సుదర్శన, మన్యు, భూసూక్త హోమాలు. హోమాలు ఫలితము 1. లక్ష్మీ గణపతి హోమం – అభీష్ఠ కార్య సిద్ధి, విద్య, ఉద్యోగ, విదేశీయాన ప్రాప్తి 2. లక్ష్మీ కుబేర హోమం – నష్టద్రవ్య ప్రాప్తి, ఋణవిముక్తి, వ్యాపారాభివృద్ధి 3. లక్ష్మీ నారసింహ హోమం – దుష్టశక్తులు, నరదృష్టి నివారణ, లక్ష్మీప్రాప్తి 4. సుదర్శన హోమం – కోర్టు విజయం, శతృనాశనం 5. మన్యుసూక్త హోమం – భూసంబంద తగాదాలనివారణ, భూసంపద వృద్ధి సాయంత్రం 4:00 గం:లకు – తీర్థప్రసాద వితరణ |
10-4-2023 సోమవారం | ఉదయం 4:00 గం:లకు మరకత శ్రీ లక్ష్మీ గణపతికి సుప్రభాతసేవ, సోమవారం విశేష అభిషేకం, ప్రాతఃకాల మంటప స్థాపిత దేవతాపూజలు. ఉదయం 9:00 గం: లకు హోమాలు. హోమాలు – ఫలితము త్రిచ, మహసౌర, అరుణ హోమాలు – ఆరోగ్యం, సంతానప్రాప్తి, పూర్వజన్మ పాపకర్మంద్వారా వచ్చే శారీరక, మానసిక వ్యాధులు,వాహన ప్రమాదాల నివారణ. సరస్వతీ యాగం, మేధాసూక్తం, శ్రద్ధాసూక్తం – విద్యార్థులు,విద్యాబుద్ధులు, వాక్చాతుర్యము, పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత, సృజనాత్మక కళానైపుణ్యాల సిద్ధి సర్పసూక్త హోమం, మూలమంత్ర హవనం – కాలసర్ప, కుజ దోష, వంద్యా దోష, మాంగల్యదోష నివారణ, వివాహ ప్రాప్తి,అన్యోన్యదాంపత్య, సంతానప్రాప్తి. చండీ హోమం – గ్రహానుకూలత, బాలారిష్ఠ, అంతఃశ్శతృ నివారణ,సర్వత్ర జయం. రుద్ర హోమం – అపమృత్యు, అనారోగ్య, వాహన ప్రమాదాల నివారణ, సర్వకార్యసిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి. సాయంత్రం 4:00 గం:లకు – తీర్థప్రసాద వితరణ |
11-4-2023 మంగళవారం | ఉ: 4:00 గంటలకు మరకత శ్రీ లక్ష్మీ గణపతికి సుప్రభాతసేవ, విశేష అభిషేకం, మహా లింగార్చన, మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం, శిఖరాభిషేకం, పుష్పయాగం, మహదాశీర్వచనం. సాయంత్రం 4:00 గం: లకు – కళ్యాణము |
బ్రహ్మోత్సవ హోమాలలో పాల్గొనిన భక్తులకు అక్షరలక్షల జపం జరిపించిన మరకత గణపతి లాకెట్ మరియు లక్ష్మీ గణపతి యంత్ర సహిత వెండి డాలర్ మహా ప్రసాదంగా ఇవ్వబడును.
సంప్రదించు ఫోన్ నెం.: 99490 60885, 94409 87638, 95503 17277
మరకత శ్రీలక్ష్మీగణపతికి మల్లెపూలు, మోదకాలతో హోమం
త్రిమూర్తులను సృష్టించిన మూలపరబ్రహ్మ స్వరూపమై, త్రిగుణాధిపతియైన మరకత శ్రీ లక్ష్మీ గణపతి అనుగ్రహం మరియు గ్రహశాంతి, సకల శుభాల కొరకు అగ్నిహోత్రంలో మూలికలు, ఆవు నెయ్యితో, హోమ ద్రవ్యాలైన అటుకులు,
వరిపేలాలతొ, గణపతికి ప్రీతికరమైన మల్లెపువ్వులను తేనెలో ముంచి, మోదకాలతో గణపత్యదర్వణ శీర్షిపనిషత్, లక్ష్మీ గణపతి మూలమంత్ర హవనము మరియు పాయసాన్నం, తామర, కలువ పువ్వులతో సంపుటిత శ్రీసూక్త పూర్వక మరకత శ్రీ మహాలక్ష్మీ దేవికి హోమం నిర్వహించబడును.
మహా పూర్ణాహుతి
పూర్ణాహుతి ద్రవ్యాలు | ఆధ్యాత్మిక ఫలితం | ఆరోగ్య ఫలితము |
పసుపు, కుంకుమ, గంధం, విబూతి, జీడిపప్పు, బాదం, పిస్తా, యాలకులు, కొబ్బరి | జ్ఞాన, సౌభాగ్యప్రాప్తి, మేధాశక్తి, కార్యజయం | రోగనిరోధక శక్తి, మెదడుకు శక్తి |
లవంగాలు, వక్కలు, ఖర్జూరాలు, భావంరాలు, గంధకచ్చూరాలు, తెల్లఆవాలు, తెల్లమిరియాలు, బిళ్వదళాలు | విద్య, ఉద్యోగ, ధనప్రాప్తి, వ్యాపారాభివృద్ధి | చర్మ, కాన్సర్ వ్యాధుల నివారణ, జీర్ణ, జీవక్రియల పెంపు, రోగనిరోధక శక్తి |
కిస్మిస్, జాజికాయ, జాపత్రి, మాధీఫల, మారేడు ఫలాలు, తమలపాకులు, పచ్చకర్పూరం, కరక్కాయ, విప్పపువ్వు, నువ్వులు, వట్టి వేళ్ళు, హవన్ పొడి, నవగ్రహ సమిధలు, నవధాన్యాలు | వివాహ, సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం | జీర్ణ, జీవక్రియల పెంపు, సంతాన ప్రాప్తి, మానసిక ఒత్తిడి తగ్గించుట |
ఆపిల్, సంత్ర, దాళిమ్మ, మోదకాలు, చెరుకుముక్కలు, ఉండ్రాళ్ళు | నవగ్రహ దోషాల నివారణ, భూ, ఆర్థిక, కోర్టు, ఋణ సమస్యలు, రాజకీయ లబ్ది | రోగనిరోధక శక్తి, దీర్ఘ వ్యాధుల నివారణ, మానసిక ప్రశాంతత |
పూజా సమయము
ఉ: 7:30 ని:లకు – బుధ, ఆదివారము మరియు సంకట హరచతుర్థి
నవగ్రహ అభిషేకాలు, శనికి తైలాభిషేకం, నవగ్రహ హోమాలు
“పూర్వ జన్మకృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
తచ్చాంతిః ఔషదైః దానైః జప హోమ క్రియాడిభిః
అని శారీరక మానసిక లోపాలకు శాంతిగా, ఔషధ సేవనం, దానాలు, జపాలు, హోమాలు చేయడం భారతీయ సంప్రదాయంగా ఉంది. మానవ జీవితంపై నవగ్రహల దశ, అంతర్దశ స్థితుల ఆధారంగా చూపే దుష్ప్రభావాలను దూరం చేసుకోవడానికి మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కల సువర్ణ, సపత్ని, సవాహన పూర్వక నవగ్రహాలకు ప్రతి శనివారం అభిషేకం, శనికి తైలాభిషేకం, దానాలు మరియు అర్క, మోదుగ, చండ్ర, రావి, మేడి, జమ్మి, మామిడి, గరిక, మర్రి, ధర్భ, ఉత్తరేణి సమిధులలో నవగ్రహ హోమాలు యథా శాస్త్రీయంగా గురువుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడును.
గ్రహ సంచారాన్ని బట్టి గ్రహాధిపత్యకాలంలో సవర్ణ, సపత్ని, సవాహన పూర్వక నవగ్రహాలను అర్చించే జాతకులకు అన్ని ఈతి బాధలు తొలుగుతాయి.
సవర్ణ, సపత్ని, సవాహన పూర్వక నవగ్రహాలు
గ్రహం పేరు | రంగు | ధర్మపత్ని పేరు | వాహనం | దానాలు | ఫలితము |
సూర్యుడు | ఎరుపు | ఉషా, ఛాయ | సప్తాశ్వరధం | గోధుమలు, గోధుమపిండి, ఎర్రని వస్త్రాలు, రాగి, బంగారు వస్తువులు | అనారోగ్య, మానసిక బాధలు తొలుగును, పదోన్నతులు, మనఃశాంతి |
చంద్రుడు | తెలుపు | రోహిణి | లేడి | బియ్యం, వెండి, తెల్లని వస్త్రాలు | నేత్ర, మానసిక బాధల నివారణ, సంతానం, మనఃశాంతి |
అంగారకుడు | ఎరుపు | శక్తిదేవి | గొర్రె | ఎర్ర వస్త్రాలు, కందులు, కందిపప్పు | ఋణ విముక్తి, శత్రుబాధ నివారణ |
బుధుడు | ఆకుపచ్చ | జ్ఞాన శక్తిదేవి | సింహం | పెసలు, ఆకుపచ్చని దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మందులు, పెసరపప్పు | వృత్తి, వ్యాపారాభివృద్ధి, వ్యవహార నైపుణ్యం, ధనలాభం |
గురుడు | పసుపు | తారాదేవి | ఏనుగు | పుస్తకాలు, బంగారు వస్తువులు, పట్టు బట్టలు పండ్లు, శనిగలు, శనగపప్పు, తీపి వస్తువులు | విద్య, జ్ఞానం, అధికారం, కీర్తి |
శుక్రుడు | తెలుపు | సుకీర్తి దేవి | గుర్రం | బొబ్బర్లు, చక్కెర, పూలు, ఆవు, అలంకరణ వస్తువులు | కార్యసిద్ధి, వివాహాది శుభకార్యాలు, ధనప్రాప్తి |
శని | నలుపు | జ్యేష్టా దేవి | కాకి | నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులు, సిమెంట్, నువ్వుండలు, నేరేడు పండ్లు | ఆరోగ్యం, పదోన్నతి, దీర్ఘాయువు |
రాహు | దూమ్రవర్ణం | కరాళీదేవి | సింహం | మినప్పప్పు, దుంపలు, ఆవాలు | భయాందోళనలు తగ్గును, ధనప్రాప్తి |
కేతు | దూమ్రవర్ణం | చిత్రా దేవి | గ్రద్ద | ఉలవలు, మిక్స్డ్ కలర్ వస్త్రాలు, ఆహార పదార్థాలు | సర్పభయాలు, దైవశక్తి, మోక్షప్రాప్తి |
నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం
జంటనగరాల్లో నిత్యఅన్న ప్రసాద వితరణ కావించబడుచున్న ప్రథమ దేవాలయం
“అన్నాశ్రితాని భూతాని అన్నం ప్రాణమితి శృతిః
తప్మాదన్నం ప్రదాతద్యం అన్నం పరమం హవిః
అన్నదానం సమం దానం త్రిలోకేషు నవిద్యతే”
అన్నం పర బ్రహ్మ స్వరూపమని వేదాలు ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి. అన్నం సర్వజీవాధారం అటువంటి అన్నాన్ని సకల శక్తులను, సర్వవ్యాపకత్వాన్ని కల్గి ఆదిపురుషుడైనట్టి, సస్యకారకుడైన మరకత శ్రీ క్ష్మీగణపతి దేవాలయానికి అన్నార్తులై వచ్చిన వారందరిని శివస్వరూపులుగా భావించి, వారి ఆకలిని తీర్చడానికి అన్నప్రసాద విరాళాలు ఇచ్చేవారంతా సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపాలే అగుదురని భావించి “మరకత శ్రీ లక్ష్మీ గణపతి అన్నప్రసాదం ట్రస్టు” “మరకత శ్రీ లక్ష్మీ గణపతి అన్నప్రసాదం ట్రస్టు” ద్వారా ప్రతిరోజు దేవాలయములో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కల చిలకలగూడ చౌరస్తాలో మరియు బంజారాహిల్స్ లోని బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర (సుమారు 6000 మందికి) భక్తులకు అన్నప్రసాద వితరణ కావించబడుచున్నది.
“ఆర్థిక, నష్ట ద్రవ్య, గృహ, వాస్తు, శల్య, అనారోగ్య నర దృష్టి, నవగ్రహ దోషాలతో సతమతమయ్యే వారు మరకత శ్రీలక్ష్మీ గణపతి స్వామి వారి కొలువులో అన్నదానం చేసిన భక్తులకు ఏడేడు తరాలు ధన, ధాన్య, పుత్ర, పౌత్రాభివృద్ధిని పొందుటకు స్వామి వారి దర్బారు సేవలో అన్నప్రసాద దాతలకు వేద ఆశీర్వచనం ఇవ్వబడును.
నిత్య అన్నప్రసాద విరాళముల వివరములు
శాశ్వత అన్నదానం
శాశ్వత అన్నదాన సభ్యుని పేరు మీద ప్రతిరోజు 11 మందికి చొప్పున 25 సం:ల పాటు అన్నదానం జరుగును. మొదటి సం:లో వారి పేరు మీద ఒక రోజున లక్ష్మీ గణపతి, కుబేర, ఆయుష్య హోమాలు నిర్వహించబడును. వారికి స్వామి వారి శేషవస్త్రాలు, అక్షర లక్షల జపం చేసిన మహిమాన్యిత మరకత గణపతి లాకెట్ ప్రసాదంగా ఇవ్వబడును.
దశవర్ష అన్నదానం
దశవర్ష అన్నదాన సభ్యుడు సం:లో కోరుకున్న ఏదైన ఒక రోజున వారి పేరు మీద 50 మందికి అన్నదానం 10 సం:ల పాటు జరుగును. వీరికి స్వామివారి శేషవస్త్రాలు, లడ్డూ, వడ ప్రసాదముగా ఇవ్వబడును.
విశేష అన్నదానం
ఒక్కరోజు పూర్తి (500 మందికి పైగా) అన్నదానానికి విరాళం ఇచ్చిన వారికి ఆరోజు అలయములో వారి పేరున ప్రత్యేక పూజ, స్వామి వారి శేషవస్త్రం, లడ్డూ, వడ ప్రసాదముగా ఇవ్వబడును.
అన్నదానం
516 రూ:లు విరాళమిచ్చిన వారి పేరు మీద మరుసటి రోజున 11 మందికి అన్నదానం చేయబడును.
విరాళాలు, ధన, వస్తు రూపేణ ఎంతైనా ఇవ్వవచ్చును. శాశ్వత విరాళాలు ఇచ్చిన భక్తుల పేర్లు అన్నప్రసాద వితరణ శాలలో ప్రదర్శించబడును. సంప్రదించు ఫోన్ నెం.: 99490 60885, 94409 87638, 95503 17277
సువర్ణ పుష్పార్చన సేవ
క్షీరసాగర మథనం జరిగినపుడు ఉద్భవించిన సముద్రరాజ తనయ శ్రీ మహాలక్ష్మి దేవిలోని ఒక అంశను విష్ణువాంశ సంభూతుడైన గణపతికి ఇవ్వడంతో లక్ష్మీ గణపతిగా అవతరించి, ఐశ్వర్య ప్రధాతయై మరకత శ్రీలక్ష్మీగణపతిగా ధనదాన్య సమృద్ధిని కలుగజేస్తున్నాడు.
“హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రామ్” అంటూ శ్రీ సూక్తములో తెలుపబడిన, శోభనప్రదమైన, మనోహరమైన శ్రీమన్మహాలక్ష్మిని వామాంకముపై కూర్చుండబెట్టుకుని మరకత శ్రీలక్ష్మీ గణపతిని ‘స్వర్ణం పవిత్రమమలం స్వర్ణం పాప ప్రణాశనమ్’ అంటూ ఐశ్వర్యములో పవిత్రమైన, శ్రేష్ఠమైన, సువర్ణ పుష్పములతో 21 శుక్రవారములు పూజించుట వలన పూర్వజన్మ పాపకర్మము నశించి, స్థిరలక్ష్మీ కటాక్షం, అప్లైశ్వర్య ప్రాప్తి, మనఃశాంతి కలుగును.
పూజ జరుగు సమయము : ప్రతి శుక్రవారం గురుహోర సమయం ఉ: 10:00 గంటలకు ప్రారంభం.
మరకత శ్రీలక్ష్మీగణపతి – ఒడిగంటి సేవ
“సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే:”
ఓంకారరూపుడై, ఆది అంతములేని ఆనందమూర్తియై అప్లైశ్వర్య ప్రదాయకుడైన మరకత శ్రీ లక్ష్మీ గణపతికి, సర్వమంగళ స్వరూపిణియై, ధన, దాన్య, విద్యా, ఆరోగ్య, ఐశ్వర్య, జ్ఞాన, సంతాన, విజయ లక్ష్ములైన అష్టవిధ లక్ష్మీ దేవతల అనుగ్రహం అందించే మహాలక్ష్మిని భక్తితో పూజించి, సౌభాగ్య మంగళ శ్రీ ద్రవ్యములగు – పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం, చీర, ధోవతి, ఒడిబియ్యం సమర్పించి ఇంటిల్లిపాదికి సమస్త శుభాలు కలిగించమని, సర్వసౌభాగ్యాలు ఒసగమని ప్రార్థించడమే మరకత శ్రీ లక్ష్మీ గణపతి – ఒడిగంటి సేవ.
పూజా సమయము : శుక్రవారం ఉ: 11:30 ని: లకు
మరకత శ్రీ లక్ష్మీ గణపతి – వస్త్రాలంకరణ సేవ
బుధ, ఆదివారము మరియు సంకటహర చతుర్థి రోజున తెల్లవారుఝామున ఉ: 4.30 ని: లకు వస్త్రాలంకరణ సేవలో పాల్గొను భక్తులు పట్టువస్త్రములు, ఒడిగంటి ద్రవ్యములతో ఆలయం చుట్టు ప్రదక్షిణచేసి స్వామివారిని దర్శించి, గోత్రనామాలతో పూజచేసి, పట్టువస్త్రములు, ఒడిగంటి ద్రవ్యములను (పసుపు, కుంకుమ, గంధం, గాజులు, ఒడిబియ్యం) వ్వాపార, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధికై, కీర్తి ప్రతిష్ఠలు, సకల శుభాలు కలగాలని స్వామివారికి సమర్పిస్తారు. వేద ఆశీర్వచనము, అభిషేక, హోమాల అనంతరం విశిష్ఠ ప్రసాద వితరణ జరుగును.
పూజా సమయం: ఉ: 4:30 గం: లకు
మరకత శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవములు
సోమవారం 18-9-2023 నుండి గురువారం 28-9-2023 వరకు ముద్గల పురాణంలో కణ్వమహర్షి, భరతుడికి భాద్రపద శు: చవితి గణపతి వ్రత మహిమ, పూజానియమాల గురించి, మట్టిగణపతి ఆవశ్యకత, ఏకవింశతి పత్రార్చన గురించి చెప్పినట్లు స్పష్టముగా ఉన్నది. జడపదార్దమైన భూమికి చైతన్యం కల నీళ్ళతో చేరినపుడు భూమి ఆహారపదార్ధాలను, ఔషదులను అందిస్తుంది. అంటే ప్రాణాధార జడశక్తుల కలయికతో సృష్టి సాగుతుందనడానికి సంకేతంగా భూతత్వానికి అధిష్ఠాన దేవత మరియు మూలధార చక్రానికి అధిదేవతయైన గణపతిని పూజిస్తారు. భాద్రపద శు: చవితి సోమవారం 18-9-2023 నుండి చతుర్దశి గురువారం 28-9-2023 వరకు 11 రోజుల పాటు జరిగే గణపతి నవరాత్రి మహోత్సవాలలో మరకత శ్రీలక్ష్మీ గణపతి స్వామివారు వరసిద్ధి, మహా, వికట, లంబోధర, గజానన, మహోధర, ఏకదంత, వక్రతుండ, విఘ్నరాజ, దూమ్రవర్ణ, మరకత శ్రీలక్ష్మీ గణపతి స్వామిగా దర్శనమిస్తారు. అభిషేక, హోమాదుల తరువాత ఏకవింశతి దివ్యపత్రార్చన, మహానీరాజనాలు ఘనంగా జరుగుతాయి.
ఏకవింశతి దివ్యపత్రములతో గణపతి సహస్రనామార్చన
అవతారము | దివ్యపత్రములు | పూజా ఫలితము | నైవేద్యాలు |
వరసిద్ధి గణపతి | ఏకవింశతి పత్రపూజ | సర్వకార్య సిద్ధి, సర్వాభీష్ఠసిద్ధి,ఆరోగ్య సిద్ధి | ఉండ్రాళ్ళు |
మహా గణపతి | శమీపత్రం (జమ్మి) జాజి పత్రం | నవగ్రహ, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, శ్వాస, చర్మ, దంత, పక్షవాత నివారణ | బాదుషాలు |
వికట గణపతి | అర్కపత్రం (జిల్లేడు) చూతపత్రం (మామిడి) | ఆర్థిక, ఆరోగ్య, సంతాన సమస్యలు, ముక్కు, గొంతు, బి.పి., గుండె జబ్బుల నివారణ | అటుకులు లడ్డూలు |
లంబోదరుడు | మాచీపత్రము (దవనం) బిళ్వదళం (మారేడు) | నవగ్రహ, అప్పుల బాధలు నివృత్తి, కంటి, కామెర్లు, షుగర్, కీళ్ళ వ్యాధులు నివారణ | మైసూర్పాక్ |
గజాననుడు | అర్జున పత్రం (మద్ది) బృహతీపత్రం (వాకుడాకు) | ఆరోగ్యసిద్ధి, సంతానప్రాప్తి, గుండె, ఆస్తమా, లీవర్ సమస్యల నివారణ | రవ్వకేసరి |
మహోధరుడు | అపామార్గపత్రం (ఉత్తరేణి) బదరీపత్రం (రేగు | మానసిక, ఆరోగ్య, వ్యాపార, సంతాన సమస్యలు, నిద్రలేమి, దంత, చర్మ, నరాల బలహీనత నివారణ | మినపవడలు |
ఏకదంతుడు | గండకీపత్రం దత్తూరపత్రం (ఉమ్మెత్త) | సర్వకార్యసిద్ధి, మాససిక, విద్య సమస్యలు కీళ్ళు, లైంగిక వ్యాధుల నివారణ | కొబ్బరి లడ్డూలు |
వక్రతుండుడు | సింధువార పత్రం (వావిలి) విష్ణుక్రాంత పత్రం (అవిసె) | సర్వకార్య జయం, విద్య, మానసిక సమస్యలు, షుగర్, కంటి, అజీర్ణ నవరత్న లడ్డూలు సమస్యలు, నవగ్రహ దోశ నివారణ | నవరత్న లడ్డులు |
విఘ్నరాజు | మరువకపత్రం దాడిమిపత్రం (దానిమ్మ) | సర్వకార్యసిద్ధి, వివాహం, అన్యోన్య దాంపత్యం, ఉద్యోగాల్లొ ఉన్నతస్థానం, ఆరోగ్య సమస్యలు | నేతి అప్పాలు |
ధూమ్రవర్ణుడు | అశ్వత్థ పత్రం (రావి) కరవీరపత్రం (గన్నేరు) | ఉన్నతస్థానం, ఆరోగ్య సమస్యలు విద్య, సంతానప్రాప్తి, ఆరోగ్యసిద్ధి | మోదకాలు |
మరకత శ్రీ లక్ష్మీ గణపతి | దేవదారు పుష్పాలు గరిక | సర్వకార్య, సర్వాభీష్ఠసిద్ధి, సంతాన సమస్యలు, కిడ్నీ సమస్యల నివారణ | ఉండ్రాళ్ళు మొక్కజొన్న గారెలు |
గమనిక: 11 రోజులు వరుసగా అభిషేక, హవన, ఏకవింశతి పత్రార్చనలో పాల్గొనిన వారికి మరకత గణపతి లాకెట్ మరియు లక్ష్మీ గణపతి యంత్ర సహిత వెండి డాలర్ మహాప్రసాదంగా ఇవ్వబడును.
సంప్రదించు ఫోన్ నెం : 99490 60885, 94409 87638, 95503 17277
దేవి శరన్నవరాత్రులు
ఆదివారం 15-10-2023 నుండి మంగళవారం 23-10-2023 వరకు
ఒక్కొక్క మన్వంతరములో, కల్పములో, యుగములో దుష్టశక్తులు విజృంభించిన సమయములో, ఆదిప్రణవరూపుడు, పరబ్రహ్మ స్వరూపమైన మహాగణపతి యొక్క రూపమే శ్రీదేవిగా, ఆమెయే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా
అవతరించి మధుకైటభులను, మహిషాసురున్ని, శుంభనిశుంభులను, చండముండులను, దుర్గమాసురున్ని, డోలాసురున్ని సంహరించినట్లు దేవిభాగవతములో శక్తి స్వరూపిణి భగవతి ఆదిపరాశక్తి తన యొక్క
మహామహిమను బహిర్గతపరచి సమస్త లోకాలకు శాంతిని చేకూర్చినదని చెప్పబడింది.
శుద్ధ సత్వస్వరూపిణియై, సర్వసంపదలకు అధిష్ఠాత్రిగా, సర్వసస్యాత్మికగా, భూతకోటికి జీవనోపాయ రూపిణిగా, సర్వమంగళ కారిణియై, ఐశ్వర్యప్రదాయినిగా ఉన్న అష్టలక్ష్ముల సమిష్టి రూపమే శ్రీ మహాలక్ష్మి.
“యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్త స్యై నమస్త స్యై నమోనమః :
అనగా అన్ని జీవులలో ఉండే లక్ష్మీస్వరూపాన్ని శరన్నవరాత్రులలో ఆదిలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, ధైర్యలక్ష్మీ, గజలక్ష్మీ, సంతానలక్ష్మి, విజయలక్ష్మీ, విద్యాలక్ష్మీ, ధనలక్ష్మీ, మరకత శ్రీలక్ష్మీ, రూపాలుగా ఆరాధించడం వల్ల అప్టైశ్వర్య, ఆరోగ్యప్రాప్తి కలుగుతుంది. శతృపీడ తొలగి సర్వత్రా విజయం సిద్ధిస్తుంది.
సత్కర్మలు, శుచీ, శుభ్రత, సదాచారం ఉన్న ఇంట కొలువై ఇహపరాలను అందిస్తూ, ఆనందం, సంతోషం, సుఖం, శాంతి, సౌఖ్యాలను కలుగజేస్తూ సృష్టిలోని సమస్త సంపదలను అనుగ్రహించే తల్లిని ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
ఆదివారం తేది. 15-10-2023 నుండి దశమి మంగళవారం 23-10-2023 వరకు జరిగే దేవి శరన్నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారములో దేదీప్యమానముగా దర్శనమిచ్చే “మరకత శ్రీ మహాలక్ష్మీ దేవిని” దర్శించి పూజించి, నైవేద్యాలను సమర్పించి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం.
కార్తీక మాసోత్సవాలు
“న కార్తీక సమో మాసో నకృతేన సమం యుగమ్
నవేద సదృశం శాస్త్రం న తీర్థం గంగాయ సమః “
శివకేశవులకు ప్రీతికరముగా స్నాన, దాన, జప, దీపారాధన వలన జన్మజన్మల పాపాలను హరించి, అప్లైశ్వర్యాలను సిద్ధింపజేసి అనంతమైన పుణ్యఫలాలను పొంది ఇహంలో సర్వసుఖాలను అనుభవించి, అంత్యాన మోక్ష ప్రాతి కలుగుతుందని పద్మ, స్కాంద పురాణాలు కార్తీకమాస మహత్తును తెలుపుతున్నాయి.
కార్తీక మాస పూజలు – వివరములు
తేదీ/సమయము | ఆర్జిత సేవలు | ఫలితము |
12-11-2023 ఆదివారం ఉ: 6:00 గం: లకు | దీపావళి: లక్ష్మీగణపతి, లక్ష్మీ కుబేర హోమాలు | ఆర్థిక, ఋణ బాధల నివృత్తి, లక్ష్మీ కటాక్ష సిద్ధి, వ్యాపారాభివృద్ధి |
ప్రతి సోమవారం ఉ: 5:00గం:లకు 20-11-2023 27-11-2023 4-12-2023 11-12-2023 | పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురువు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య అర్చిత గురు పరంపరాగత మహాస్పటిక శివలింగాలకి భక్తులచే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, మహాపూర్ణాహుతి | అపమృత్యు, నవగ్రహ దోషాల నివారణ, విద్య, వివాహ, కీర్తి, ఆయురారోగ్య, ఐశ్వర్య, సౌభాగ్య, సత్సంతాన, అధికార ప్రాప్తి, మనఃశాంతి |
26-11-2023 ఆదివారం ఉ: 10:00 గం:లకు | రమా సహిత శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం | ఆయురారోగ్య, ఐశ్వర్య, విద్య, వివాహ, సంతాన ప్రాప్తి, అభీష్ఠసిద్ధి, లక్ష్మి కటాక్షం, మనఃశాంతి |
27-11-2023 సోమవారం ఉ: 4:00 గం: లకు | కార్తీక పౌర్ణమి ధాత్రీసమేత లక్ష్మీ నారాయణ వ్రతం, జ్యోతి ప్రజ్వలనం, సాలగ్రామ, దీపదానాలు | మనోవాక్కాయ కృతపాపాలు నశించుట, విద్య, జ్ఞాన, ఆయువృద్ధి, సర్వభోగాలు, అధికారప్రాప్తి, మనఃశాంతి |
CONTACT INFO
Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015