ఆది ప్రణవ స్వరూపుడై, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై, ఈ జగమంతా వ్యాపించిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రతీ సంవత్సరం చైత్ర బ|| పాడ్యమి నుండి పంచమి వరకు అంగరంగ వైభవంగా, నేత్ర పర్వముగా ఆధ్యాత్మిక శోభతో భక్తి పూర్వకముగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేయు అశేష భక్తజన వాహినికి ఇదే మా ఆహ్వానము.
బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందాన్ని ఇచ్చే లక్ష్మీగణపతి స్వామిని, ధనం, విద్య, వివాహ, ఆరోగ్య, వ్యాపార, యశో, శ్రేయ కారకుడైన బుధ గ్రహ రత్నమై ప్రపంచంలో అరుదైన, అద్భుతమైన మరకతమణి (పచ్చ-ఎంరాల్డ్) శిలతో మలచిన స్వామి దర్శనంతో నేత్ర, జీర్ణ, నరాల, వాత, కఫ, అశాంతి, ఒత్తిడి, కోర్టు, ఋణ, అకాల వైర దోషాలు తొలుగుతాయి.
ఆలయంలోని సవర్ణ, సపత్ని, సవాహన పూర్వక నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి రధోత్సవ, బ్రహ్మోత్సవ, హోమ కార్యక్రమాలలో పాల్గొనే భక్తులకు మరియు ఆశ్లేషా, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారు, వృషభ, మిధున, కన్యా, వృశ్చిక, మీనరాశుల వారు 5,7,14,16,23,25 తేదీలలో జన్మించిన వారందరూ స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొనిన నవగ్రహ దోషాలు, కలి దోషాలు నివారించబడి మాయా మోహాలు తొలిగి జ్ఞాన బీజాలు అంకురించి అభీష్ట సిద్ధి, ధనదాన్య సమృద్ధి ఆటంకాలు తొలిగి సకల శ్రేయస్సులు కలుగుతాయి.
బ్రహ్మోత్సవాలలో భక్తులచే స్వయంగా లక్ష్మీ గణపతి , లక్ష్మీ కుబేర , లక్ష్మీ నారసింహ, సుదర్శన , మన్యుసూక్త హోమాలు, త్రిచ అరుణ,మహాసౌరయాగాలు , సరస్వతి , వేదాసూక్త , శ్రద్ధసూక్త హోమాలు, సుబ్రహ్మణేశ్వర, రుద్ర, చండీ హోమాలు చేయించబడును. చివరి రోజున మహాలింగార్చన, మహాపూర్ణాహుతి , శాంతికళ్యాణం నిర్వహించబడును.
CONTACT INFO
Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015