Marakatha Sri Laxmi Ganapathi Devastanam

మరకత శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానము

మరకత శ్రీ గణపతి దేవాలయ ట్రస్టు

పూజ్య గురువులు , దేవిఉపాసకులు , లలాటరేఖా శాస్త్రనిపుణులైన బ్ర|| శ్రీ || డా || మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి  గారికి అమ్మవారు స్వప్నములో కనిపించి ఆలయమును నిర్మించమని  కోరగా, మరకత శ్రీ లక్ష్మీ గణపతి మరియు సవర్ణ, సాపత్నీ , సవాహన పూర్వక నవగ్రహ విగ్రహాలను 27 -4 -2016  లో ప్రతిష్టించి , అభిషేక , హోమ, అర్చన, జప, ద్యాన, అన్నదానాదులను చేయడం ద్వారా స్వామి వారి కృపను భక్తులందరికి పంచుతున్నారు.

“మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ట్రస్టు” ద్వారా ప్రముఖులచే ధార్మిక , ఆధ్యాత్మిక ప్రవచానాలిప్పించడం, మానవతా విలువలుఎం సత్సాప్రదాయాలు, సంస్కృతిని తెలియజేయస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రంథ ముద్రణ వంటి అంశాలు చేపడుతున్నారు.

మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ట్రస్టుకు అనుబంధ ట్రస్టులైన MSLG అన్న ప్రసాదం ట్రస్టు ద్వారా దేవాలయం లో  మరియు సికింద్రాబాద్ లోని చిలకగూడ చౌరస్తా  వద్ద 5000  మందికి అన్న ప్రసాద వితరణ గావిస్తుంది.

శ్రీ  మోత్కూరు రామశాస్త్రి చారిటబుల్ ట్రస్టు” ద్వారా అనేక మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ, పేదవారికి ఉచిత వైద్య సౌకర్యాలు, విద్యార్థులకు విద్యావసతులు, స్త్రీ . బాల, వృద్ధాశ్రమాలకు చేయూత నిస్తూ “మానవసేవయే మాధవ సేవాయని”, “కాయిక సేవయే కాత్యాయని సేవాయని ” ప్రతీ వ్యక్తిలో తానూ ఉపాసించే దైవాన్ని దర్శిస్తూ గురువుగారు సామాజిక సేవను చేయుచున్నారు.

శ్రీ మోత్కూరు రామ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ :

తన తండ్రి గారి జ్ఞాపకార్థం  శ్రీ మోత్కూరు  రామశాస్త్రి  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి  వరకు సుమారు ౨౧ మెడికల్ క్యాంప్స్ నిర్వహించి పేదవారికి ఉచిత వైద్య సౌకర్యాలు , నిరుపేద  విద్యార్థులకు విద్యావసతులు, స్త్రీ , బాల ,వృద్దాశ్రమాలకు చేయూతనిస్తూ “మానవసేవయే మాధవసేవయని” ‘కాయికసేవయే కాత్యాయని సేవ ‘ యని ప్రతివ్యక్తిలో తానూ ఉపాసించే దైవాన్ని దర్శిస్తూ సామాజిక సేవ చేస్తున్నారు.

CONTACT INFO

Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015 

SOCIAL MEDIA